For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానిని కొట్టేసిన స్టార్ క్రికెటర్.. వైరల్ అవుతున్న వీడియో!

Star All-rounder Shakib Al Hasan attacks fan

స్టార్ క్రికెటర్ల చుట్టూ కాంట్రవర్సీలు ఉండటం సహజమే. కానీ ఈ కాంట్ర వర్సీలపై ఎలా రియాక్ట్ అవుతారనే విషయమే వారి స్వభావాన్ని తెలుపుతుంది. ఈ లెక్కన చూసుకుంటే బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ చాలా ఉద్రేక స్వభావం ఉన్నవాడని తెలిసిపోతుంది. టీ20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు సారధ్యం వహించే షకీబల్ హసన్.. ఈ రెండు ఫార్మాట్లలో కూడా ప్రపంచ నెంబర్ వన్ ఆల్‌రౌండర్ అన్న సంగతి తెలిసిందే.

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్..

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్..

టెస్టుల్లో కూడా షకీబ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఫార్మాట్లో ప్రపంచ బెస్ట్ ఆల్‌రౌండర్లలో మూడో ర్యాంకులో ఉన్నాడు. ఇలా కేవలం ఆటతోనే కాదు. చిన్న చిన్న గొడవల కారణంగా షకీబల్ హసన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. తనకు అనుకూలంగా అంపైర్లు నిర్ణయం ఇవ్వకపోతే వాళ్లతో గొడవకు దిగడం, అవసరమైతే వికెట్లు పీకి పక్కన పటేయడం వంటి చేష్టలు అతను చేయడం చాలా మందికి తెలిసిందే.

అయితే ఇప్పుడు షకీబల్ హసన్ చేసిన పని మరింత గొడవకు దారితీసింది. ఇటీవలే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కూడా మాట్లాడుతూ.. షకీబల్ హసన్, మరో సీనియర్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ మధ్య గొడవలు ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

అభిమానిపై దాడి..

చట్టోగ్రాంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు షకీబల్ హసన్ వచ్చాడు. ప్రమోషనల్ ఈవెంట్ కోసం అతన్ని పిలిచినట్లు తెలుస్తోంది. దీనికోసం వచ్చిన అతన్ని చూసేందుకు బంగ్లా అభిమానులు ఎగబడ్డారు. ఇలా తనను చుట్టుముట్టిన వారిలో ఒక వ్యక్తిపై షకీబల్ హసన్‌ దాడి చేశాడు.

చేతిలోని క్యాప్‌తో ఆ అభిమానిని చాలాసార్లు కొట్టాడు. ఇది చూసిన సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని ఈ స్టార్ క్రికెటర్‌ను పక్కకు తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో మరోసారి షకీబల్ ప్రవర్తనపై కాంట్రవర్సీ చెలరేగింది.

జట్టులో చాలా కీలకం..

జట్టులో చాలా కీలకం..

తాజాగా టీ20 ఫార్మాట్‌లో విశ్వవిజేత ఇంగ్లండ్‌పై బంగ్లాదేశ్ జట్టు తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో ఒక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసుకున్న షకీబల్ హసన్.. 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆరు వికెట్ల తేడాతో బంగ్లా ఈ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో కూడా 75 పరుగులు చేసి, ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కూడా బంగ్లా విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బౌలింగ్‌లో కూడా చెలరేగిన అతను నాలుగు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు.

Story first published: Saturday, March 11, 2023, 16:55 [IST]
Other articles published on Mar 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+