Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శిఖ‌ర్ ధావ‌న్ గాయంపై బాంబు పేల్చిన ఫీల్డింగ్ కోచ్!

ICC Cricket World Cup 2019 : Dhawan Could Struggle In Slips After Recovering : Coach Sridhar
Standing in the slip will be an issue for Shikhar Dhawan, says India fielding coach

లండ‌న్: వేలి గాయంతో నాలుగు వారాల పాటు ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌కు దూర‌మైన టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ విష‌యంలో మ‌రో బాంబు పేల్చారు ఫీల్డింగ్ కోచ్ రామ‌స్వామి శ్రీధ‌ర్‌. ఇక‌పై శిఖర్ ధావ‌న్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేయ‌డం స‌వాల్‌తో కూడుకున్న విష‌య‌మ‌ని అన్నారు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేయ‌డం ఇక అంత సులువు కాద‌ని చెప్పారు. బ్యాటింగ్ సంద‌ర్భంగా ఇబ్బందులు త‌లెత్త‌క‌పోవ‌చ్చ‌ని, ఆయ‌న‌కు ఇష్ట‌మైన‌ స్లిప్ ఫీల్డింగ్‌లో మాత్రం శిఖ‌ర్ ధావ‌న్ కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల్సి రావ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దూరం నుంచి బంతిని కీప‌ర్ లేదా నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్ వైపు విసిరడం పెద్ద స‌మ‌స్య కాక‌పోవ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.

సాధార‌ణంగా శిఖ‌ర్ ధావ‌న్‌.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. ప్రారంభంలో కొన్ని ఓవ‌ర్ల పాటు ఆయ‌న స్లిప్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. ఇక‌పై అది సాధ్యప‌డ‌క‌పోవ‌చ్చ‌ని తేల్చేశారు ఫీల్డింగ్ కోచ్‌. లాంగ్ ఆఫ్, లాంగ్ ఆన్‌, పాయింట్ వైపు ఇకపై ఎక్కువ‌గా ఆయ‌న‌ను ఫీల్డింగ్‌లో నిల‌పాల్సి ఉండొచ్చ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. శిఖ‌ర్‌ను స్లిప్‌లో ఫీల్డింగ్‌లో ఉంచాలా? వ‌ద్దా? అనే విష‌యంపై ఇప్పుడే ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోలేమ‌ని, మొద‌ట ఆయ‌న‌ను లైట‌ర్ బాల్ ద్వారా పరీక్షించాల్సి ఉంటుంద‌ని అన్నారు. తొలుత లైట‌ర్ బాల్‌తో క్ర‌మంగా క్రికెట్ బాల్‌తో క్యాచ్‌ల‌ను ప‌ట్ట‌డంపై ప‌రీక్ష‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. గాయం త‌గిలినప్ప‌టి నుంచి 10 లేదా 12వ రోజు శిఖ‌ర్‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని అన్నారు.

ఆస్ట్రేలియాతో బ్యాటింగ్ సంద‌ర్భంగా శిఖ‌ర్ ధావ‌న్ వేలికి గాయ‌మైన విష‌యం తెలిసిందే. పాట్ క‌మ్మిన్స్ విసిరిన బౌన్స‌ర్‌ను ఆడే క్ర‌మంలో బంతి నేరుగా అత‌ని వేళ్ల‌ను తాకింది. దీనితో వేలు చిట్లింది. ఫ‌లితంగా- నాలుగు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌రం అని డాక్ట‌ర్లు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ- ప్ర‌స్తుతం శిఖ‌ర్ ధావ‌న్ నెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. శ‌రీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవ‌డానికి జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో శిఖ‌ర్ 109 ప‌రుగులు చేశారు.

Story first published: Friday, June 14, 2019, 16:11 [IST]
Other articles published on Jun 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+