Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విశాఖ స్టేడియాన్ని పరిశీలించిన ఐపీఎల్‌ అధికారులు

Standby for IPL: Dr YSR ACA-VDCA Stadium ready to host IPL matches

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని ఏసీఏ-వీడీసీఏ మైదానాన్ని ఐపీఎల్‌ అధికారులు పరిశీలించారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను తరలించే అవకాశం ఉంది. ఈ పరిస్థితే వస్తే అప్పటికప్పుడు ఏమీ చేయలేరు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అధికారులు విశాఖ మైదానాన్ని సందర్శించారు.

ఎన్నికలు ఉన్న కారణంగా మొదటగా కొన్ని మ్యాచ్‌లకు సంబందించిన షెడ్యూలును విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక.. ఐపీఎల్‌ మిగతా షెడ్యూలును విడుదల చేశారు ఐపీఎల్‌ అధికారులు. అయితే ఎన్నికల కారణంగా షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరిగినా.. మైదానాలను మార్చే అవకాశం ఉంది.

Standby for IPL: Dr YSR ACA-VDCA Stadium ready to host IPL matches

ఈ నేపథ్యంలో మ్యాచ్‌లను తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని ముందే భావించిన బీసీసీఐ.. విశాఖను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. ఈ ఇందులో భాగంగానే ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కేథరిన్‌ సింప్సన్‌ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం స్టేడియాన్ని పరిశీలించింది. అయితే మ్యాచ్‌ల నిర్వహణకు స్టేడియం సిద్ధంగా ఉందని ఏసీఏ కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ ఐపీఎల్ అధికారులకు వివరించారు. అయితే వైజాగ్ అభిమానులు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. ఇక్కడ ఏ మ్యాచ్‌లు జరిగినా అభిమానులతో మైదానం మొత్తం నిండిపోతది. అతి త్వరలో విశాఖలో మ్యాచ్‌లు జరుగుతాయా లేదా? అనే విషయం తెలియరానుంది.

Story first published: Thursday, April 4, 2019, 10:55 [IST]
Other articles published on Apr 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+