Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీఎస్‌ఎల్ ముందు ఐపీఎల్‌ చాలా తక్కువ: అబ్దుల్ రజాక్

Standard of cricket in PSL is better than IPL, claims Abdul Razzaq

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఐపీఎల్ నచ్చలేదంట, ఈ పాక్ క్రికెటర్ కి. మూడో సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ చాలా బాగుంటుందని, నాణ్యమైన ఆట ఆడేందుకు అవకాశం ఉంటుందని సొంత గొప్పలకు పోతున్నాడు. అబ్దుల్ రజాక్.

విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌ ఈ ఏడాది 11వ సీజన్‌ను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా పీఎస్‌ఎల్‌ రెండు సీజన్లు ముగించుకుని ఈ ఏడాది మూడో సీజన్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ ఆటగాడు అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ..'పీఎస్‌ఎల్‌ టోర్నీ ఎంతో నాణ్యమైనది. నా వరకు ఇది ఐపీఎల్‌ కంటే మెరుగైన టోర్నీ. అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడాలనుకున్న వారికి పీఎస్‌ఎల్‌ వేదిక చాలా అనువైనది. పీఎస్‌ఎల్‌లో ఆడాలని నాకూ ఉంది. నా ఫిట్‌నెస్‌ను బాగా మెరుగుపరుచుకుని వచ్చే ఏడాది పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు సిద్ధమవుతా' అంటూ రజాక్ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది పీఎస్‌ఎల్‌-3వ సీజన్‌ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 25 వరకు జరగనుంది. టోర్నీలో మ్యాచ్‌లు అన్ని దుబాయ్‌లో జరగనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చి 25న కరాచీలో భారీ బందోబస్తు మధ్య నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 11వ సీజన్‌కు కూడా షెడ్యూలు ఖరారైంది. ఏప్రిల్‌ 4 నుంచి మే 31 వరకు జరగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాడు. ఐపీఎల్ 10 కి సంబంధించిన వేలాన్ని బెంగుళూరులో ఈ నెల 27, 28తేదీల్లో నిర్వహించనున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 2, 2018, 17:33 [IST]
Other articles published on Jan 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+