For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సెయింట్ కిట్స్.. ఈ మ్యాచ్ అయినా గెలిచేనా?

 St Kitts and Nevis Patriots have won the toss and have opted to field

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్, బార్బడోస్ ట్రైడెంట్స్ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన సెయింట్ కిట్స్ కెప్టెన్ రేయాద్ ఎమిరిట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం సెయింట్ కిట్స్ రెండు మార్పులు చేసింది. మరోవైపు బార్బడోస్ ట్రైడెంట్స్ గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగింది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పిచ్ కొంచెం పచ్చికతో కూడుకుంది. మొదటగా నెమ్మదిగా స్పదిస్తుందని పిచ్ క్యూరేటర్ డానీ మోరిసన్ చెప్పారు. పిచ్ కొంచెం బౌలర్లకు అనుకూలించినా.. 160 పరుగులు చేయొచ్చని చెప్పారు. ఇక సీపీఎల్‌ 2020 సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టని సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్.. ఈ మ్యాచ్లో అయినా విజయం సాధిస్తుందో చూడాలి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. సెయింట్ జట్టుకు ఇది నాలుగో మ్యాచ్. మరోవైపు బార్బడోస్ ట్రైడెంట్స్ ఆడిన మూడు మ్యాచులలో ఒక విజయం సాధించి.. పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభమే ఇస్తున్నారు. జాన్సన్ చార్లెస్ బౌండరీలతో చెలరేగుతున్నాడు. ఇప్పటికే మూడు ఫోర్లు బాది మంచి ఊపుమీదున్నాడు. మరోవైపు షై హోప్ నెమ్మదిగా ఆడుతున్నాడు. 11 బంతులాడి కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. అల్జారీ జోసెఫ్.. హోప్‌ను పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. ప్రస్తుతం బార్బడోస్ 5 ఓవర్లు ముగిసే సరికి 32 పరుగులు చేసింది. క్రీజులో చార్లెస్ (21), హోప్ (10) ఉన్నారు.

Teams:
St Kitts and Nevis Patriots: Chris Lynn, Evin Lewis, Joshua Da Silva, Nick Kelly, Denesh Ramdin(w), Ben Dunk, Sohail Tanvir, Rayad Emrit(c), Imran Khan, Jon-Russ Jaggesar, Alzarri Joseph.

Barbados Tridents: Johnson Charles, Shai Hope(w), Corey Anderson, Kyle Mayers, Jason Holder(c), Ashley Nurse, Raymon Reifer, Nyeem Young, Mitchell Santner, Rashid Khan, Hayden Walsh.

Story first published: Tuesday, August 25, 2020, 20:17 [IST]
Other articles published on Aug 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+