Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలిస్తే తప్ప అటు వెళ్లను: షారూఖ్

Shahrukh Khan
ముంబయి‌: తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) కోల్ కొత్తా నైట్ రైడర్స్ జట్టు వరుస అపజయాలతో విసిగిపోయిన యజమాని, బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఇంటి ముఖం పట్టాడు. జట్టు సభ్యుల మధ్య విభేదాలతో అట్టుడుకుతూ మునిగిపోతున్న జట్టును వదిలేసి బుధవాం ఆయన తిరుగు ముఖం పట్టాడు. జట్టు అపజయం పట్ల తనకు బాధగా ఉందని ఆయన ముంబయి విమానాశ్రయంలో షారూఖ్ అన్నారు. సభ్యుల్లో ప్రతిభకు కొదవ లేదని, అయినా ఓడిపోతుండడం విచారంగా ఉందని, కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తన వోటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన ఈ నెల 30వ తేదీన తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తారని భావించారు. అయితే తన జట్టు గెలవడం ప్రారంభించే వరకు అటు వైపు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ గురువారం విజయ్ మాల్యాకు చెందిన బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో తలపడనుంది.

జట్టు కెప్టెన్ గా మెక్యుకలమ్ సరైన క్రీడాకారుడని, అయితే అతను మరిన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉందని షారూఖ్ అన్నారు. దక్షిణాఫ్రికాలో గుంగూలీ ఆట తీరును కూడా ఆయన మెచ్చుకున్నారు. దాదా బాగా ఆడుతున్నాడని ఆయన అన్నారు. జట్టు కలిసికట్టుగా ఫలితం సాధించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+