న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంసీసీ అధ్యక్షుడిగా కుమార సంగక్కర

Srilankan Cricketer Kumara Sangakkara set to become next MCC President

మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర నియమితులయ్యారు. బుధవారం లార్డ్స్‌లో ఎంసీసీ వార్షిక సమావేశంలో ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు ఆంటోనీ రెఫార్ట్‌ ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సంవత్సరం అక్టోబరు 1న సంగక్కర బాధ్యతలు చేపట్టనున్నారు. సంవత్సరం పాటు సంగక్కర ఈ పదవిలో కొనసాగుతారు.

ఎంసీసీకి అధ్యక్షుడిగా పని చేయబోతున్న తొలి బ్రిటిషేతరుడు సంగక్కర. క్రికెట్‌ నిబంధనల రూపకల్పనలో ఎంసీసీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 2012లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యత్వం అందుకున్న సంగక్కర క్లబ్‌ ప్రపంచ క్రికెట్‌ కమిటీలోనూ భాగమయ్యాడు.

'ఎంసీసీ అధ్యక్షుడిగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నాను. అధ్యక్షుడిగా పనిచేయడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఎంసీసీ ప్రపంచంలోని గొప్ప క్రికెట్ క్లబ్. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడానికి నా వంతుగా కృషి చేస్తాను' అని కుమార సంగక్కర తెలిపారు.

Story first published: Thursday, May 2, 2019, 10:39 [IST]
Other articles published on May 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X