Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. చావో రేవో తేల్చుకోనున్న ఇంగ్లండ్

Srilanka Won the toss and choose to bat first

టీ20 ప్రపంచకప్‌లో కీలక పోరుకు అంతా సిద్ధమైంది. గ్రూప్1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరు సెమీస్ చేరతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక సారధి దాసున్ షనక తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ తాము న్యూజిల్యాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడామని, అప్పుడు పిచ్‌లో కొంత టర్న్ కనిపించిందని షనక తెలిపాడు.

ఇప్పుడు కూడా పిచ్ అలాగే ఉంటుందని ఆశిస్తున్నామన్నాడు. అలాగే తమ జట్టులో ప్రమోద్ మదుశన్ స్థానంలో కరుణరత్నే ఆడుతున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ మాట్లాడుతూ తాము తమ బెస్ట్ క్రికెట్ ఆడితేనే తర్వాతి రౌండ్‌కు చేరుకుంటామన్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఇంగ్లండ్ జట్టు సెమీస్ చేరుతుంది. లేదంటే ఆస్ట్రేలియా సెమీస్ చేరి ఇంగ్లండ్ జట్టు ఇంటి దారి పడుతుంది.

శ్రీలంక: కుశాల్ మెండిస్, పాథుమ్ నిస్సంక, ధనంజయ డిసిల్వ, చరిత్ ఆసలంక, భానుక రాజపక్స, దాసున్ షనక (కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, కాసున్ రజిత, లాహిరు కుమార

ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయీన్ అలీ, శామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అదిల్ రషీద్

ఆస్ట్రేలియాకు కీలకం..
ఈ మ్యాచ్ గెలిస్తేనే ఇంగ్లండ్ జట్టు సెమీస్ చేరుతుంది. లేదంటే ఆస్ట్రేలియా సెమీస్ చేరి ఇంగ్లండ్ జట్టు ఇంటి దారి పడుతుంది. ప్రస్తుతం గ్రూప్-1 నుంచి న్యూజిల్యాండ్ ఇప్పటికే సెమీఫైనల్ చేరుకుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరే రెండో జట్టు ఏదనే విషయం ఇంకా తేలలేదు. ఈ రేసులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 7 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టు కూడా 7 పాయింట్లు సాధిస్తుంది. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా ఇంగ్లండ్ సెమీస్ చేరుతుంది.

Story first published: Saturday, November 5, 2022, 13:25 [IST]
Other articles published on Nov 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+