Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాన్ బెర్రా వన్డే: భారత్ పై శ్రీలంక విజయం

TM Dilshan
కాన్‌బెర్రా: ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా కాన్ బెర్రాలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంక భారత్ పై ఘన విజయం సాధించింది. భారత్ పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలిచింది. దిల్షాన్ అద్భుతమైన అర్థ సెంచరీ సాధించాడు. అతను 62 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. శ్రీలంక ఇన్నింగ్సును జయసూర్య, దిల్షాన్ ధాటిగా ప్రారంభించారు. జయసూర్య కేవలం 13 బంతుల్లో 27 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. సంగక్కర పది బంతుల్లో పది పరుగులు చేసి హర్భజన్ సింగ్ బౌలింగులో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వికెట్లు పడకుండా శ్రీలంక విజయాన్ని అందుకుంది. వర్షం కురవడంతో ఇన్నింగ్సును కుదించారు. దీంతో శ్రీలంక 152 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. జయవర్ధనే 35 బంతుల్లో 36 పరుగులు చేశాడు.

అంతకు ముందు టీం ఇండియా యువ ఆటగాళ్లు రోహిత్ శర్మ, గౌతం గంభీర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాణించడంతో భారత్ నిర్ణీత 29 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (70, 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచింది. వర్షం కారణంగా మొదట మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు సచిన్ టెండూల్కర్ (32), వీరేంద్ర సెహ్వాగ్ (14) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వరుస ఓవర్లలో వీరిద్దరూ వెనుదిరిగినప్పటికీ అనంతరం వచ్చిన గంభీర్ (35), రోహిత్ శర్మ, ధోనీ (31) లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ముందు భారత్ ధీటైన లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభించడానికి వీల్లేక పోవడంతో అంపైర్లు ఓవర్లను కుదించి ఆట ప్రారంభించారు. 19 ఓవర్లో 100 పరుగుల మార్కును చేరుకున్న భారత్ మిగిలిన 10 ఓవర్లలో 95 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో మలింగ, మహరూఫ్, కులశేఖర తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
Story first published: Tuesday, February 12, 2008, 13:07 [IST]
Other articles published on Feb 12, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+