అబ్దుల్లా షఫీక్ అసామాన్య పోరాటంతో చరిత్రాత్మక విజయం సాధించిన పాకిస్థాన్..

గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 4వికెట్ల తేడాతో హిస్టారిక్ విజయం సాధించింది. అయిదో రోజు గెలుపు కోసం మరో 120పరుగులు కావాల్సిన తరుణంలో పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160పరుగులు 408బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) సెంచరీతో చెలరేగి కడవరకు క్రీజులో నిలబడ్డంతో శ్రీలంకపై పాక్ గెలుపొందింది.
తద్వారా 342పరుగులు ఛేదించి.. గాలే స్టేడియంలో అత్యధిక ఛేజ్ చేసిన జట్టుగా పాక్ నిలిచింది. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక పాక్ బ్యాటర్లలో రెండో ఇన్నింగ్స్‌లో ఇమాముల్ హక్ (35), కెప్టెన్ బాబర్ ఆజామ్ (55), మహమ్మద్ రిజ్వాన్ (40) రాణించారు. ఇక శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్లతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 4వికెట్లు తీసి పాకిస్థాన్‌ను కాస్త తిప్పలు పెట్టాడు.

పాకిస్థాన్‌కు షాకిచ్చేలా వర్షం
ఈ టెస్ట్‌లో 222పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు విజయం అంతా ఈజీగా ఏం దక్కలేదు. ప్రభాత్ జయసూర్య ముప్పుతిప్పలు పెట్టేలా బౌలింగ్ చేశాడు. రెండు మూడు ఎల్బీడబ్ల్యూ ప్రయత్నాలు మిస్సయ్యాయి. శ్రీలంక రివ్యూలు కోరినా పాకిస్థాన్‌కే అనుకూలంగా డీఆర్ఎస్ రిజల్ట్ వచ్చింది.
ఇక లక్ష్యం దిశగా సాగుతున్న టైంలో 276పరుగుల వద్ద రిజ్వాన్ ఔటవ్వడంతో ఉత్కంఠ రేకెత్తింది. ఆఘా సాల్మన్, హసన్ అలీ సైతం త్వరత్వరగా ఔటయ్యాడు. దీంతో చివరి 4వికెట్లకు 39పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే మహమ్మద్ నవాజ్ (19)తో కలిసి షఫీక్ టార్గెట్ దిశగా నడిపించాడు. ఇక 11పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం జోరందుకుంది. దీంతో మ్యాచ్ గంటసేపు ఆగిపోయింది. అయితే కాసేపు తెరిపివ్వడంతో మిగతా 11పరుగులు చేసి పాక్ గెలుపొందింది.

తొలి ఇన్నింగ్స్ బాబర్ ఆజామ్ సెంచరీ
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 222పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ దినేష్ చండిమాల్ (76పరుగులు) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 5వికెట్లతో రాణించడంతో పాక్ టాపార్డర్ కుప్పకూలింది.
అయితే కెప్టెన్ బాబర్ ఆజామ్ (119) సెంచరీతో పాటు టెయిలెండర్లతో కలిసి విలువైన భాగస్వామ్యం నమోదు చేయడంతో పాక్ 218పరుగులు చేయగలిగింది. ఇక నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. ఓషద ఫెర్నాండో (64), కుశాల్ మెండిస్ (76) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాటు చండిమాల్ (94) రాణించడంతో 337పరుగులు చేసింది.
తద్వారా పాకిస్థాన్‌కు 342పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక నిర్దేశించింది. ఇక చివరి ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ వీరోచితమైన సెంచరీ పోరాటంతో ఆ జట్టు 6వికెట్లు కోల్పోయి 344పరుగులు చేసి చరిత్రాత్మక విజయం అందుకుంది.

తుది జట్లు
పాకిస్థాన్ : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, అజర్ అలీ, బాబర్ ఆజం (సి), అఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా
శ్రీలంక : ఓషద ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే (సి), కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమల్, నిరోషన్ డిక్వెల్లా (వికెట్), రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, ప్రబాత్ జయసూర్య, కసున్ రజిత
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications