
హైదరాబాద్ : శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం వల్ల జరగాల్సిన రోడ్డు ప్రమాదం కొద్దిగలో తప్పి క్షేమంగా బయటపడ్డారు. వారు ప్రయాణిస్తోన్న బస్సు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది.
నెట్ ప్రాక్టీస్ నిమిత్తం బయల్దేరిన శ్రీలంక జట్టు ఆటగాళ్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వారు బస చేస్తున్న నోవాటెల్ హోటల్ నుంచి బస్సులో బయల్దేరారు. బయటికి వస్తుండగానే డ్రైవరు ఏమరుపాటుగా ఉండటంతో బస్సు ఓ గోడను బలంగా తాకింది. అప్రమత్తమైన డ్రైవర్ మళ్లీ బస్సును యథావిధిగా సరైన దిశలో నడిపాడు. క్రికెటర్లకు ఏ గాయం కలగకపోవడంతో ప్రాక్టీసుకు క్షేమంగా వెళ్లారు.
భారత్-శ్రీలంక వన్‌డేకు ఏర్పాట్లు పూర్తి
నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు
డిసెంబరు 17 ఆదివారం జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తై నట్లు మ్యాచ్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, పోర్టు ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం రాత్రి స్టేడియంలో జరిగిన నిర్వహణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ భద్రత, పార్కింగ్, టిక్కెట్ల విక్రయాలు, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై ఆయన మాట్టాడారు.
శుక్రవారం మధ్యాహ్నానికే స్టేడియం టిక్కెట్లు 70 శాతం వరకు ఆన్‌లైన్‌లో అమ్ముడైనట్లు ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ తెలిపారు. శనివారానికల్లా మిగతా టిక్కెట్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని నిర్వహణ కమిటీ సభ్యులు చెప్పారు. సమావేశంలో విశాఖపట్టణం జిల్లా కలెక్టరు ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, డీసీపీ ఫకీరప్ప పాల్గొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.