Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంక తొండి ఆట: వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ మిస్

Virender Sehwag
దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా సోమవారం జరిగిన వన్డే మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, నాటకీయంగా వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ మిస్సయ్యాడు. సెహ్వాగ్ సెంచరీ చేయకుండా శ్రీలంక తొండి ఆట ఆడింది. భారత్‌ విజయానికి 33 పరుగులు అవసరమైన దశలో వీరూ 74 పరుగులతో ఉన్నాడు. ఆ దశలో సెహ్వాగ్‌ సెంచరీపై ఎవరూ దృష్టిపెట్టలేదు. ఐతే వీరూ చివర్లో తనదైన శైలిలో దూకుడుగా ఆడి శరవేగంగా తొంభైలోకి వచ్చాడు. అతను 99లో ఉన్నపుడు భారత్‌ విజయానికి 5 పరుగులు కావాలి. సెహ్వాగ్‌ స్త్ట్రెకింగ్‌. ఇంకేముంది సెంచరీ పూర్తయినట్లే అనుకున్నారంతా. కానీ 35వ ఓవర్‌ తొలి బంతికి బైస్‌ రూపంలో 4 పరుగులొచ్చాయి. తర్వాతి రెండు బంతులు వృథా అయ్యాయి.

తర్వాతి బంతికి వీరూ ముందుకొచ్చి సిక్స్‌ కొట్టాడు. కానీ అది నోబాల్‌. అదనపు పరుగుకే భారత్‌ విజయం పూర్తవడంతో సిక్స్‌ ను పరిగణనలోకి తీసుకోలేదు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే సంగక్కర బైస్‌ వదిలేయడం, ఈ సీజన్లో టెస్టుల్లో కాని, వన్డేల్లో కాని ఒక్క నోబాలైనా వేయని రణ్‌ దీవ్‌ మరీ ముందుకొచ్చి నోబాల్‌ వేయడం చూస్తే కావాలని శ్రీలంక ఆటగాళ్లు సెహ్వాగ్ సెంచరీని అడ్డుకున్నారనిపిస్తోంది. రణ్ ‌దీవ్‌ ఉద్దేశపూర్వకంగానే నోబాల్‌ వేశాడు. వీరూ సెంచరీ మిస్‌ అయిన సంగతి తనకు తెలియదని సంగక్కర బొంకాడు.

కావాలనే తాను సెంచరీ చేయకుండా శ్రీలంక ఆటగాళ్లు అడ్డుకున్నారని వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. అయితే తనకు సెంచరీ కన్నా భారత్ విజయమే ముఖ్యమని అతను అన్నాడు. సెంచరీ పూర్తి చేయలేకపోవడం నిరాశ కలిగించిందని, కానీ లంకకిలాంటి పనులు అలవాటేనని ఆయన అన్నాడు. గతంలో కటక్ ‌లో సచిన్‌ 99 పరుగులపై ఉన్నపుడు కూడా వారు ఇలాంటి ఎత్తుగడే వేశారని, ఇంతకుముందు నోబాల్‌ వేయని రణ్ ‌దీవ్‌ ఇప్పుడు వేశాడంటే నమ్మశక్యంగా లేదని అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+