Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్‌ అనంతరం ఆస్ట్రేలియాలో స్థిరపడనున్న మలింగ

Srilanka Pacer Lasith Malinga obtains Australian residency, will stay in Australia permanently

శ్రీలంక సీనియర్ పేసర్, స్పీడ్‌ స్టర్ లసిత్‌ మలింగకు ఆస్ట్రేలియా పర్మినెంట్‌ రెసిడెన్సీ (పీఆర్‌) లభించింది. దీంతో మలింగ ఆస్ట్రేలియాలోనే స్థిరపడనున్నారని సమాచారం తెలుస్తోంది. మలింగ త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించనున్నారు. స్వదేశంలో కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో భాగంగా ఈ నెల 26న జరిగే తొలి వన్డేతో మలింగ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ చివరిది:

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ చివరిది:

ఆస్ట్రేలియాలో పీఆర్‌ లభించడంతో రిటైర్మెంట్‌ అనంతరం కుటుంబంతో కలసి ఆస్ట్రేలియాలోనే శాశ్వతంగా ఉండనున్నాడు. అంతేకాదు అక్కడ కోచ్‌గా పని చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ నెల 26న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి వన్డేనే మలింగకు చివరిది. మొత్తం సిరీస్‌ ఆడమని లంక సెలెక్టర్లు కోరినప్పటికీ.. తొలి వన్డే తర్వాత రిటైర్మెంట్‌ ఇస్తా అని స్పష్టం చేశాడు.

మూడో బౌలర్‌గా:

మూడో బౌలర్‌గా:

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాపై మలింగ తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మలింగ ఒక వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (56) సాధించిన మూడో బౌలర్‌గా మలింగ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌ (55)ను అధిగమించారు. ఈ జాబితాలో ఆసీస్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ (71), శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ (68) ముందున్నారు.

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌:

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌:

ప్రపంచకప్‌-2019లో మలింగ మొత్తం 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో మలింగ 219 ఇన్నింగ్స్‌లలో 335 వికెట్లు సాధించాడు. 11 సార్లు నాలుగు వికెట్లను సాధించగా.. 8 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్నాడు. ముత్తయ్య మురళీ ధరన్‌ (523), చమిందా వాస్‌ (399)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

నాలుగు బంతులు.. నాలుగు వికెట్లు:

నాలుగు బంతులు.. నాలుగు వికెట్లు:

కరీబియన్ దీవుల్లో జరిగిన 2007 ప్రపంచకప్‌లో మలింగ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జార్జ్ టౌన్‌లోని ప్రావిడెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ బుల్లెట్ బంతులకు షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్ కలిస్, మఖయా ఎన్తిని వరుసగా పెవిలియన్ చేరారు.

రెండో ప్రపంచకప్‌ హ్యాట్రిక్:

రెండో ప్రపంచకప్‌ హ్యాట్రిక్:

2011 ప్రపంచకప్‌లో మలింగ రెండో ప్రపంచకప్‌ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ దాటికి తన్మయ్ మిశ్రా, పీటర్ ఒంగాండో, షెమ్ ఎంగోచి వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో ప్రపంచకప్‌ చరిత్రలో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా లసిత్ మలింత అరుదైన ఘనత సాధించాడు.

అత్యంత వేగంగా 50 వికెట్లు:

అత్యంత వేగంగా 50 వికెట్లు:

ప్రపంచకప్‌ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా మ‌లింగ అరుదైన ఘనత సాధించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డును అందుకున్న వారిలో మెక్‌గ్రాత్, ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్, వసీం అక్రమ్‌లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో చేరిన నాలుగో బౌలర్‌గా మలింగ గుర్తింపు పొందాడు.

Story first published: Sunday, July 21, 2019, 14:08 [IST]
Other articles published on Jul 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+