డంబుల్లా: తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ కు భారత బౌలర్లు బుధవారం రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకున్నారు. సరిగ్గా శ్రీలంకను 142 పరుగులకు ఆల్ అవుట్ చేశారు. తొలి వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఇదే స్కోరును సాధించింది. జహీర్ ఖాన్ చెలరేగి బౌలింగ్ చేయడంతో శ్రీలంక టాప్ ఆర్డర్ కూలిపోయింది. 44 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను తుషార, కులశేఖర ఆదుకున్నారు. టాప్ ఆర్డర్ చేతులెత్తేసినప్పటికీ టెయిల్ ఎండర్లు భారత బౌలర్లను చికాకు పరిచారు. తషార 44 పరుగులు చేయగా, కులశేఖర 25 పరుగులు చేశాడు. నాలుగు పరుగులకే శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక 38.3 ఓవర్లకే చేతులెత్తేసింది.
భారత బౌలర్లలో జహీర్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా, ప్రవీణ్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. హర్భజన్ కు రెండు వికెట్లు, పఠాన్ ఒక్క వికెట్ తీశారు. జయసూర్య కూడా భారత బౌలర్లను ఎదుర్కోవడానికి తడబడ్డాడు. జయసూర్య 13 పరుగులు మాత్రమే చేశాడు. సంగక్కర రెండు పరుగులు చేశాడు. చివరలో ఫెర్నాండో 12 పరుగులు చేశాడు. జయవర్ధనే రెండు పరుగులు చేయగా, కపుగెదర డకవుట్ అయ్యాడు. శ్రీలంగ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే భారత్ తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. విరాట్ కోహ్లీతో కలిసి ఇర్ఫాన్ భారత ఇన్నింగ్సును ప్రారంభించాడు. జ్వరం కారణంగా సెహ్వాగ్ ఈ మ్యాచుకు దూరమయ్యాడు.