For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డెన్మార్క్ ఓపెన్: చరిత్రకు అడుగు దూరంలో కిదాంబి శ్రీకాంత్

భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ మరో సూపర్‌ సిరీస్‌ను ఖాతాలో వేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీలో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లా

By Nageshwara Rao

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ మరో సూపర్‌ సిరీస్‌ను ఖాతాలో వేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీలో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో విన్సెంట్ వాంగ్ వింగ్‌పై 21-18, 21-17 తేడాతో వరుస గేముల్లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించాడు.

ఈ సిరిస్‌లో అన్ని మ్యాచుల్లోనూ అద్భుత ప్రదర్శన చేసిన శ్రీకాంత్ ఫైనల్లో కూడా తప్పక విజయం సాధించాలని భారత బ్యాడ్మింటన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఫైనల్లో శ్రీకాంత్ విజయం సాధిస్తే అతడికి ఇది మూడో సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టైటిల్‌ అవుతుంది. ఫైనల్లో 22వ ర్యాంకర్‌ లీ హ్యున్‌ (కొరియా)తో శ్రీకాంత్‌ తలపడనున్నాడు.

Srikanth one step away from third Super Series title

ఈ సీజన్‌లో ఇండోనేసియా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గడంతో పాటు సింగపూర్‌లో ఫైనల్‌ చేరిన శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. సెమీస్‌లో భాగంగా జరిగిన పోరులో ఆరంభం నుంచే ఇద్దరూ దూకుడుగా ఆడారు. చెరో ఆరు పాయింట్లు గెలిచి సమంగా నిలిచారు. అయితే భారత షట్లర్‌ నెట్‌ గేమ్‌లో మెరుగ్గా ఆడి 11-6తో ఆధిక్యంలోకి వెళ్లాడు.

విరామం తర్వాత వాంగ్‌ 10-13తో అంతరం తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ, అతనికి అవకాశం ఇవ్వని శ్రీ 15-10తో ముందంజ వేశాడు. ఆ తర్వాత విన్సెంట్ వాంగ్ వింగ్‌ దూకుడుగా ఆడటంతో 15-18తో నిలిచాడు. చివరి వరకు హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను 21-18తో శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు.

ఇక, రెండో గేమ్‌ను కూడా 21-17తో సొంతం చేసుకున్న శ్రీకాంత్ పైనల్‌కు అర్హత సాధించాడు. ఇక, మహిళల సింగిల్స్‌లో రచనోక్‌ (థాయ్‌లాండ్‌), అకనె యమగుచి (జపాన్‌) ఫైనల్లో ప్రవేశించారు.

డెన్మార్క్ ఓపెన్ ఫైనల్:
శ్రీకాంత్ (ఇండియా) Vs లీ హ్యూన్ (కొరియా)
రాత్రి 7 గంటల నుంచి Stars Sports 2, Star Sports 2 HDలో ప్రత్యేక ప్రసారం

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+