For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కర్రలేనిదే శ్రీలంక జయసూర్య కాలు కదపలేడు

Sri Lankan Legend Sanath Jayasuriya Unable to Walk Without Crutches

హైదరాబాద్: శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య. ఎన్నో పరుగులను చేసిన అంతర్జాతీయ స్థాయి క్రికెటర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు నడవలేకపోతున్నాడు. కర్రలను ఊతంగా తీసుకుని దైనందిన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఒకానొక సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు చుక్కలు చూపించిన జయసూర్య ఇపుడు అనారోగ్యంతో ఎవరూ ఊహించని రీతిలో బాధపడుతున్నాడు.

మోకాలి గాయం కారణంగా జయసూర్య నడవలేని స్థితిలో ఉన్నాడు. స్ట్రెచర్స్‌ లేనిదే జయసూర్య అడుగులు వేయలేని పరిస్థితి. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం జయసూర్య త్వరలో ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. మెల్‌బోర్న్‌లో ఆయన మోకాలికి ఆపరేషన్‌ చేయించుకోవాల్సిందే వైద్యులు చెప్పడంతో ఆయన ఆస్ట్రేలియా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.

శస్త్రచికిత్స అనంతరం జయసూర్య కోలుకోవడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుందని.. అప్పటి వరకు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు. శ్రీలంక క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్‌ ఆటగాడైన జయసూర్య.. తన కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నాడు.

టెస్టుల్లో 6973 పరుగులు, 98 వికెట్లతో ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన జయసూర్య వన్డేల్లో 13430 పరుగులు, 323 వికెట్లు పడగొట్టాడు. టీ20 ల్లో అతను 629 పరుగులు చేసి 19 వికెట్లు తీసుకున్నాడు. 1996లో శ్రీలంక వరల్డ్‌ కప్‌ గెలవడంలో జయసూర్య కీలక పాత్ర వహించాడు.

శ్రీలంక క్రికెట్ బోర్డుకు జయసూర్య రెండుసార్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగాడు. అయితే 2017 లో సౌతాఫ్రికా, భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో లంక జట్టు పేలవమైన ప్రదర్శన కనబర్చడంతో జయసూర్య సెలెక్షన్ కమిటీ చైర్మన్‌ పదవికి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 6, 2018, 16:19 [IST]
Other articles published on Jan 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+