కోచ్ రేసులో లేను: తెరపైకి అనూహ్యంగా జయవర్దనే పేరు (ట్వీట్)
హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి శ్రీలంక మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాట్స్‌మెన్ మహిళా జయవర్దనే దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ఆహ్వానించిన దరఖాస్తుల గడువుని పెంచింది.
ఈ క్రమంలో జయవర్దనే కోచ్ పదవి కోసం తన ఆసక్తిని కనబరిచినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జులై 9 వరకు కోచ్ పదవికి అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంతో కోచ్ పదవికి మహిళా జయవర్దనే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. క్రికెటర్‌గా 40 ఏళ్ల మహిళా జయవర్దనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

శ్రీలంక తరుపున 652 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జయవర్దనే 25,957 పరుగులు చేశాడు. అందులో 54 సెంచరీలు, 136 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఐపీఎల్ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా అవతరించడంతో జయవర్దనే కీలకపాత్ర పోషించాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కున్లా టైటాన్స్ యాజమాన్యం రాబోయే రెండు సీజన్లకు తమ జట్టు ప్రధాన కోచ్‌గా జయవర్దనేని నియమించుకుంది. క్రికెట్ దిగ్గజంగా, ఐపీఎల్‌లో కోచ్‌గా జయవర్దనే సేవలను సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్ క్రికెట్ సలహా కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇది జయవర్దనేకు కలిసొచ్చే అంశమని అంటున్నారు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన వ్యక్తులు వ్యక్తిగతంగా, వీడియో ఇంటర్వ్యూలకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.
మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్‌మూడీ, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డా గణేష్‌లు దరఖాస్తు చేసుకున్నారు. టీమిండియా డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రిని బీసీసీఐ కోచ్ పదవికి అప్లై చేయని కోరగా, కోచ్ పదవి ఇస్తానంటేనే అప్లే చేస్తానంటూ కండిషన్ పెట్టిన సంగతి తెలిసిందే.
కోచ్ రేసులో లేను: సోషల్‌మీడియాలో జయవర్దనే
టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనే దరఖాస్తు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై జయవర్దనే సోషల్‌మీడియా ద్వారా స్పందించాడు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి రేసులో తాను లేనని జయవర్దనే పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్, కున్లా టైటాన్స్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాలపై తాను పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు మహిళా జయవర్దనే చెప్పాడు. కాబట్టి టీమిండియా కోచ్ పదవికి వెళ్లే ఉద్దేశం తనకు లేదని, దరఖాస్తు చేయలేదని కుండబద్దలుగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications