Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెరపైకి ‘టాయిలెట్ గేట్’ వివాదం: క్రికెటర్లపై అనుమానం!

హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌లో తెరపైకి 'టాయిలెట్ గేట్' వివాదం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో శ్రీలంక జట్టుకు సంబంధించిన ఆటగాడి ప్రవర్తనపై జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఆ జట్టులోని క్రికెటర్లపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు శ్రీలంక డ్రెస్సింగ్ రూములో సోదాలు నిర్వహించగా.. టాయిలెట్ రూమ్‌లో ఒక అనుమానాస్పద ఎలక్ట్రికల్ పరికరం ఒకటి దొరికినట్లు తెలిసింది.

 Sri Lankan cricketer under suspicion; ICC starts investigation to ‘toiletgate’

తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓటమిపాలైన శ్రీలంక జట్టుకి ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఈ విచారణపై శ్రీలంక క్రికెట్ బోర్డుకి కనీస సమాచారం కూడా లేకపోవడం విశేషం. 'ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ప్రస్తుతం క్రికెటర్లపై విచారణ జరుపుతోంది. దీనిపై మాకు ముందస్తు సమాచారం లేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో బోర్డుకి కూడా అవగాహన లేదు' అని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ డిసిల్వా వెల్లడించారు.

అయితే జింబాబ్వే పర్యటనలో జట్టు సమావేశాలకి హాజరయ్యే సంపత్ హెటియరాచైయిస్‌ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారని డిసిల్వా తెలిపారు. అతడు జట్టులోని ఇద్దరు సీనియర్ క్రికెటర్ల పేర్లు బహిర్గతం చేసినట్లు లంక స్ధానిక మీడియాలో వార్తాలు వచ్చాయి.

దీంతో అక్కడ 'టాయిలెట్ గేట్' పేరుతో పెద్ద ఎత్తున వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో లంక క్రికెటర్లపై ఆరోపణలు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇలాంటి వివాదాలే క్రికెటర్లను చుట్టుముట్టాయి.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+