Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతాలో శ్రీలంక జట్టు: గురువారం నుంచి నెట్స్‌లో ప్రాక్టీస్

హైదరాబాద్: ఆరు వారాల సుదీర్ఘ పర్యటన కోసం దినేశ్‌ చండిమాల్‌ నేతృత్వంలోని శ్రీలంక జట్టు బుధవారం భారత్‌కు చేరుకుంది. టీమిండియాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు గాను శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చింది.

ఇరు జట్ల మధ్య నవంబర్‌ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టు గురువారం నుంచి నెట్స్‌లో ప్రాక్టీస్ చేయనున్నారు. నవంబర్ 11న బోర్డ్‌ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో పాల్గొంటారు.

Sri Lankan cricket team arrives in Kolkata for 1st Test against India

శ్రీలంక చివరిసారిగా 2009లో భారత్‌లో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 0-2తో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మొదట్లో శ్రీలంక పర్యటనక వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే శ్రీలంకతో భారత పర్యటన ముగిసిన తర్వాత శ్రీలంక అబుదాబి పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌తో రెండు టెస్టులాడిన శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే అనంతరం జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో మాత్రం 5-0తో ఓటమి పాలైంది.

భారత పర్యటనకు వచ్చే శ్రీలంక జట్టు:
దినేస్ చండీమాల్ (కెప్టెన్‌), కరుణరత్నె, ధనంజయ, సమరవిక్రమ, మాథ్యూస్‌, తిరిమన్నె, హెరాత్‌, లక్మల్‌, పెరీరా, గమగె, సందకన్‌, ఫెర్నాండో, షనక, డిక్‌వెలా, రోషన్‌ సిల్వా.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+