For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఆఫ్ఘానిస్థాన్‍పై విజయం సాధించిన శ్రీలంక.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ధనుంజయ..

Sri Lanka won the Super-12 match against Afghanistan by 6 wickets

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బ్రిస్బేన్ లో ఆఫ్ఘానిస్తాన్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఆఫ్ఘాన్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ల లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ 24 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు.

ఉస్మాన్ ఘనీ
మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ 27 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. నజీబుల్లా జద్రాన్ 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లందరు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ మహ్మద్ నబీ 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు వికెట్లు తీయగా.. లాహిర్ కుమార 2 వికెట్లు పడగొట్టాడు. కసున్ రజిత, ధనుంజయ డిసిల్వ ఒక్కో వికెట్ తీశారు.

ధనుంజయ డిసిల్వ
145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధనుంజయ డిసిల్వ 42 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుసల్ మెండిస్ 25 పరుగులు చేయగా.. చరిత్ అసలంక 19, రాజపక్స 18 పరుగులు చేశాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో శ్రీలంక గ్రూప్-1లో మూడో స్థానానికి చేరుకుంది. అయితే శ్రీలంక దాదాపు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నట్లే గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లలో రెండు జట్లు సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంది. గ్రూప్-1లో న్యూజిలాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడు పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది.

Story first published: Tuesday, November 1, 2022, 13:07 [IST]
Other articles published on Nov 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+