లాస్ట్ వన్డేలోభారత్ పై శ్రీలంక విజయం

తర్వాత ఫీల్డులోకి వచ్చిన సంగక్కర,జయవర్ధనే,కపుగదరేలు కూడా స్వల్ప స్కోరుకే ఔటవడంతో 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టెయిలెండర్లు తుషార,ముబారక్ లంకను ఆదుకున్నారు. ముందు ఆచితూచి ఆడిన వీరిద్దరూ చివరి ఓవర్లలో దాటిగా ఆడడంతో లంక స్కోరు 200 పరుగులు దాటింది. టాస్ ఆర్డర్ బ్యాట్సమన్ ను తక్కువ స్కోరుకే పెవిలియన్కు పంపిన భారత భౌలర్లు వీరిద్దరిపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. తుషార 54 పరుగులతోనూ,ముబారక్ 47 పరుగులతోనూ నాటౌటౌగా నిలిచారు. 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్ విరాట్ కోహ్లీ శుభారంభాన్నిచ్చాడు.
అయితే మరో ఓపెనర్ గంభీర్ 11 పరుగులకే ఔటయ్యాడు. కాస్సేపటికే ధాటిగా ఆడుతున్న కోహ్లితో పాటు రైనా కూడా తక్కువ స్కోరు పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించటంతో భారత్ లక్ష్యాన్ని 44 ఓవర్లకు 216 పరుగులగా నిర్ణయించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత భారత వికెట్లు పతనం వేగంగా కొనసాగింది. ఇప్పటికే సీరిస్ గెలిచుకున్నా మన్న ధీమానో ఏమో ఏ ఒక్క బ్యాట్స్మన్ క్రీజులో నిలుదొక్కుకోవటానికి ప్రయత్నించలేదు.
ఒకరి వెనుక ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 103 పరుగులకే ముగిసింది. లంక బౌలర్లలో కులశేఖర 4,మెండిస్ 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో రాణించిన కులశేఖరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టీమిండియా కెప్టెన్ ధోనీకి మ్యాన్ ఆఫ్ ది సీరిస్ అవార్డు దక్కాయి.
Story first published: Saturday, August 30, 2008, 16:55 [IST]
Other articles published on Aug 30, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications