For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WI vs SL: విండీస్‌పై శ్రీలంక విజయం.. ప్రపంచకప్‌ నుంచి డిపెండింగ్ ఛాంపియన్ ఔట్!!

West Indies knocked out of ICC T20 World Cup 2021
T20 World Cup Semifinals : IND Vs SCO భారీ విజయం.. అప్పుడే సెమీస్ కు || Oneindia Telugu

అబుదాబి: డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021 లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. శ్రీలంక నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులే చేసింది. దాంతో పొలార్డ్ సేన 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన విండీస్ ఒకే విజయం సాధించింది. మరోవైపు లంక ఐదు మ్యాచులో రెండు విజయాలతో సూపర్ 12 దశను దాటలేకపోయింది. శ్రీలంక, విండీస్ జట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021 నిష్క్రమించాయి. విండీస్ బ్యాటర్లు నికోల‌స్ పూర‌న్‌ (46), సిమ్రోన్‌ హెట్‌మైర్‌ (81) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లంక బౌలర్లు చ‌మిక క‌రుణర‌త్నే, వానిండు హ‌స‌రంగ‌, బినురా ఫెర్నాండో తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు పాథ‌మ్ నిస్సాంక‌ (51; 41 బంతుల్లో 5 ఫోర్లు), కుషాల్ పెరీరా (29)లు ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ జులిపించారు. దాంతో లంక స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నిస్సాంక, పెరీరా తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన పెరీరా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన చ‌రిత్ అసలంకతో కలిసి నిస్సాంక చెలరేగిపోయాడు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. మరోవైపు బౌండరీలు బాదాడు. వీరిద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలో నిస్సాంక హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు.

నిస్సాంక ఔట్ అయిన అనంతరం చ‌రిత్ అసలంక లంక జట్టు బాధ్యతను తీసుకున్నాడు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే అసలంక హాఫ్ సెంచరీ చేశాడు. ఆపై 68 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అసలంక పెవిలియన్ చేరినా.. చివర్లో కెప్టెన్ దాసున్ శనక (25) దూకుడుగా ఆడాడు. కీలకమైన మ్యాచ్‌లో లంకపై వెస్టిండీస్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విండీస్‌ బౌలర్లలో ఆండ్రీ రసెల్ 2, డ్వేన్ బ్రావో ఒక వికెట్‌ తీశారు. రవి రాంపాల్‌ (3-0-31-0), జాసన్‌ హోల్డర్‌ (4-0-37-0), అకీల్‌ హుస్సేన్ (2-0-22-0) పెద్దగా ప్రభావం చూపలేదు. బ్రావో వికెట్‌ తీసినా (1/42) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

Story first published: Thursday, November 4, 2021, 23:45 [IST]
Other articles published on Nov 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+