
టీ20 వరల్డ్ కప్ 2022 కీలక మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. నెదర్లాండ్ పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది సూపర్-12లోకి ప్రవేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ కుసల్ మెండిస్ 44 బంతుల్లో 5 సిక్స్ లు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అసలంక 31 పరుగులు చేయగా రజపక్సే 19, నిస్సానక 14 పరుగులు చేయడం శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
కుసల్ మెండిస్
కుసల్ మెండిస్ ఒక్కడే నెదర్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. మిగతా వారు కాస్త తడబడ్డారు. నెదర్లాండ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్, బాస్ డి లీడే రెండేసి వికెట్లు తీయగా.. ఫ్రెడ్ క్లాసెన్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి.. 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.
హసరంగ
లంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు తీయగా.. మహేష్ తిక్షణ 2 వికెట్లు పడగొట్టాడు. ఫెర్నాండో, కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గ్రూప్ ఎలో శ్రీలంక అగ్రస్థానంలో నిలిచింది. నెదర్లాండ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. శ్రీలంక సూపర్-12కు క్వాలిఫై కాగా.. నెదర్లాండ్, నమీబియాలో ఒక జట్టు సూపర్-12కు వెళ్లనున్నాయి. యూఏఈపై నమీబియా గెలిస్తే గ్రూప్ ఎ నుంచి శ్రీలంక, నమీబియా సూపర్-12కు వెళ్తాయి.