For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవిష్కా ఫెర్నాండో సెంచరీ: వెస్టిండిస్ విజయ లక్ష్యం 339

 Sri Lanka vs West Indies Live Score, CWC 2019: Avishka Fernando 104 guides Sri Lanka to 338

హైదరాబాద్: చెస్టర్ లీ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అవిష్కా ఫెర్నాండో 103 బంతుల్లో 104(9 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో చెలరేగగా... కుశాల్ పెరీరా 51 బంతుల్లో 64(8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో విండిస్‌కు 339 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విండిస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు వికెట్లు తీయగా... షెల్డన్ కాట్రెల్, ఓషాన్ థామస్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ తీసుకున్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండిస్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు సరైన ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత కరుణరత్నే(32) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అవిష్కా ఫెర్నాండోతో కలిసి కుశాల్ పెరీరా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

హాఫ్ సెంచరీ అనంతరం జట్టు స్కోరు 104 పరుగుల వద్ద కుశాల్ పెరీరా(64) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కుశాల్ మెండిస్‌తో కలిసి అవిష్కా ఫెర్నాండో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత జట్టు స్కోరు 189 వద్ద కుశాల్ వెనుదిరిగాడు.

1
43682

అయితే, అప్పటికే శ్రీలంక అత్యుత్తమ స్థితిలో నిలిచింది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన అవిష్కా ఫెర్నాండో మాత్రం సెంచరీ నమోదు చేసి శ్రీలంక భారీ స్కోరు అందించడంలో సాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ముందు వెస్టిండిస్ బౌలర్లు తేలిపోయారు. విండిస్ బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

లంక బ్యాట్స్‌మెన్లలో దిముత్ కరుణరత్నె(32), కుశాల్ మెండీస్(39), తిరుమానె(45 నాటౌట్), మాథ్యూస్(26) ఫర్వాలేదనిపించారు. లంక బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో 300పై చిలుకు స్కోరును అలవోకగా అందుకుంది. ఈ మ్యాచ్‌లో షెల్టన్ కాట్రెల్ భారీగా పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు.

{headtohead_cricket_7_8}

Story first published: Monday, July 1, 2019, 19:20 [IST]
Other articles published on Jul 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+