తొలి టెస్ట్‌లోనే తీవ్ర గాయం: రక్తమోడుతూ కుప్పకూలిన విండీస్ ప్లేయర్: అంబులెన్స్‌లో..ఆసుపత్రికి

కొలంబో: వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటన ఆరంభమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ ఉదయం మొదలైంది. గాలె స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. క్రెయిగ్ బ్రేత్‌వైట్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. దిముత్ కరుణరత్నె నాయకత్వాన్ని వహిస్తోన్న శ్రీలంక జట్టుతో టెస్ట్ సిరీస్‌ను ఆరంభించింది. శ్రీలంక గడ్డపై ఇప్పటిదాకా కూడా వెస్టిండీస్ ఒక్క టెస్ట్ మ్యాచ్‌ను కూడా గెలవలేదు. ఆ అన్ వాంటెండ్ రికార్డ్‌ను చెరిపేయాలనే పట్టుదలతో లంక గడ్డపై అడుగు పెట్టారు విండీస్ వీరులు. టెస్ట్ సిరీస్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగారు.

లంచ్ వరకు 61 పరుగులతో..
శ్రీలంక కాలమానం ప్రకారం.. ఈ ఉదయం సరిగ్గా 10 గంటలకు మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక జట్టు. కేప్టెన్ దిముత్ కరుణరత్నె, పాథుమ్ నిశ్శంక ఇన్నింగ్ ప్రారంభించారు. లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేశారు లంకేయులు. ఓపెనర్లు ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. కరుణరత్నె మూడు ఫోర్లతో 32 పరుగులు, పాథుమి నిశ్శంక రెండు ఫోర్లతో 25 పరుగులు చేశారు. నాటౌట్‌గా నిలిచారు.
గాయపడ్డ జెరోమి..
మ్యాచ్ సజావుగా సాగుతున్న సమయంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ యంగ్ క్రికెటర్- జెరెమి సొలొజొనొ తీవ్రంగా గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బ్యాటర్ ఆడిన బలమైన షాట్.. అతన్ని గాయపరిచింది. అతనికి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. సాధారణంగా స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకుంటుంటాడు. అదే అతణ్ని కొంత వరకు కాపాడిందని చెప్పుకోవచ్చు. హెల్మెట్ గ్రిల్స్‌కు బంతి బలంగా తగిలింది. దీనితో అతను ఫీల్డ్ మీదే కుప్పకూలిపోయాడు.
విరిగిన హెల్మెట్..
ఇన్నింగ్ 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోస్టన్ ఛేజ్ వేసిన ఓవర్ అది. ఆ ఓవర్ 4వ బంతిని మిడిల్ వికెట్ మీద షార్ట్ డెలివరీగా సంధించాడు ఛేజ్. ఓపెనర్ దిముత్ కరుణరత్నె దాన్ని భారీ షాట్ ఆడాడు. అది కాస్తా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న జెరెమి సొలొజొనొ హెల్మెట్ గ్రిల్స్‌ను బలంగా తాకింది. దీనితో అతను తన హెల్మెట్‌ను తొలగించి.. అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ బంతిని కరుణరత్నె ఎంత బలంగా షాట్ కొట్టాడంటే.. హెల్మెట్ గ్రిల్స్‌ను తగిలిన వెంటనే అది విరిగిపోయింది.

ఆసుపత్రిలో చికిత్స..
బంతి తగలడంతో లేవలేని స్థితికి చేరుకున్నాడు జెరొమి సొలొజొనొ. బాధతో విలవిల్లాడిపోయాడు. బ్యాటర్లు కరుణరత్నె, నిశ్శంక సహా ప్లేయర్లందరూ అతని చుట్టు మూగారు. అతని ముఖానికి టవల్‌ను చుట్టారు. ఫిజియోథెరఫిస్ట్, హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అతని వద్దకు చేరుకున్నారు. ఆ వెంటనే హుటాహుటిన స్ట్రెచర్‌పై జెరోమిని పడుకోబెట్టి ఫీల్డ్ బయటికి తీసుకెళ్లారు. అప్పటికే స్టేడియం బయట అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. అందులో అతణ్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో జెరోమికి స్కానింగ్ నిర్వహించారు. పెను ప్రమాదం తప్పిందని డాక్టర్లు నిర్ధారించారు. జెరోమికి చికిత్స చేస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications