శ్రీలంక బ్యాట్స్‌మెన్ వైఫల్యం: సఫారీల విజయ లక్ష్యం 204

హైదరాబాద్: చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. సఫారీ బౌలర్ల బౌన్సర్ల దెబ్బకు శ్రీలంక బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంక బ్యాట్స్‌మన్ చేతులెత్తేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది.
దీంతో దక్షిణాఫ్రికాకు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో కుశాల్ పెరీరా(30), అవిష్కా ఫెర్నాండో(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్, ప్రిటోరియన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా... కగిసో రబాడ రెండు, జెపి డుమిని, ఫెలుక్వాయో చెరో వికెట్ తీసుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. సఫారీ పేసర్ రబాడ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే దిముత్ కరుణరత్నె డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. రబాడ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో బంతి బ్యాట్స్‌మన్ గ్లోవ్స్‌కు తాకి రెండో స్లిప్‌లో ఉన్న డుప్లెసిస్ చేతిలో పడింది.
పరుగుల ఖాతా తెరవకుండానే మొదటి వికెట్
దీంతో శ్రీలంక పరుగుల ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫెర్నాండోతో కలిసి కుశాల్ పెరీరా జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 50కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత జట్టు స్కోరు 67 పరుగుల వద్ద అవిష్కా ఫెర్నాండో(30)ను ప్రిటోరియస్ ఔట్ చేశాడు.
వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో
ఆ తర్వాత కొద్ది సేపటికే కుశాల్ పేరీరా(30)ను కూడా ప్రిటోరియస్ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. కుశాల్ మెండీస్(23), మాథ్యూస్(11), ధనంజయ డిసిల్వా(24), జీవన్ మెండీస్(18), తిసార పెరీరా(21) ఘోరం విఫలమయ్యారు.
ప్రిటోరియస్ బౌలింగే హైలెట్
సఫారీ బౌలర్ల బౌన్సర్లకు శ్రీలంక బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. చెత్త షాట్లు, అనవసర తప్పిదాలతో వరుసగా వికెట్లను చేజార్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియస్ బౌలింగే హైలెట్‌గా నిలిచింది. లైన్ అండ్ లెంగ్త్, షార్ట్ పిచ్ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. 10 ఓవర్లు వేసి కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
{headtohead_cricket_6_7}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications