For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉత్కంఠభరిత పోరులో లంకపై కివీస్ విజయం.. సిరీస్‌ కైవసం

Sri Lanka vs New Zealand, 2nd T20I: De Grandhomme, TOm Bruce seal series win for NZ

పల్లెకెలె: శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలిఉండగానే 2-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. మంగళవారం ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో చివరకు న్యూజిలాండ్‌ విజయాన్ని అందుకుంది. 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో కివీస్ 2 వికెట్లు కోల్పోయినా.. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ వరుసగా 6,4 బాది జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో శ్రీలంకపై 4 వికెట్లతో జయభేరి మోగించింది.

మొదటగా లంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (26) బ్యాట్ జులిపించి ఔట్ అవ్వగా.. మరో ఓపెనర్ కుషాల్ పెరీరా (11) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఆవిష్క ఫెర్నాండో (37), డిక్‌వెల్లా (39) జట్టును ఆదుకున్నారు. ఇన్నింగ్స్ చివరలో జయసూరియా (20), ఉరుసు ఉడాన (13) చెలరేగడంతో కివీస్ భారీ స్కోర్ చేసింది. కివీస్ కెప్టెన్ టీమ్ సౌతీ రెండు వికెట్లు తీసాడు. సేథ్ రాన్స్ 3, స్కాట్ కుగ్గెలీజ్న్ 2 వికెట్లు తీశారు.

ఛేదనలో కివీస్ ఓపెనర్లు కోలిన్ మున్రో (13), టిమ్ సీఫెర్ట్ (15) బౌండరీల వర్షం కురిపించారు. అయితే లంక పేసర్ అఖిల ధనుంజయ మూడు వికెట్లతో రాణించడంతో ఓపెనర్లతో సహా.. స్కాట్ కుగ్గెలీజ్న్ పెవిలియన్ చేరారు. 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హోమ్‌ (59), బ్రూస్‌ (53) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అర్ధ శతకాలతో రాణించి 109 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పి పెవిలియన్ చేరారు. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సిన దశలో కివీస్ 2 వికెట్లు కోల్పోయినా.. శాంట్నర్‌ 6,4 బాది విజయాన్ని

Story first published: Wednesday, September 4, 2019, 9:34 [IST]
Other articles published on Sep 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+