రిటైర్మెంట్‌కు హెరాత్ సిద్ధం: ఇంగ్లాండ్‌తో గాలేలో చివరి టెస్టు

హైదరాబాద్: మంగళవారం నుంచి గాలే వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి టెస్టు శ్రీలంక స్పిన్ దిగ్గజం రంగనా హెరాత్‌కు ఆఖరి టెస్టు మ్యాచ్. గత 19 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న రంగనా హెరాత్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో పదో స్థానంలో (430 వికెట్లు) ఉన్నాడు.
శ్రీలంక జట్టులో స్పిన్నర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ముత్తయ్య మురళీధరన్. లంక జట్టులో మురళీధరన్ ఉన్నంత వరకు 22 టెస్టులాడి 37.88 యావరేజితో హెరాత్ కేవలం 71 వికెట్లు మాత్రమే తీశాడు. అందుకు కారణం జట్టులో మురళీధరన్ ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతుండగా, హెరాత్ రెండో స్పిన్నర్‌గా ఉండటమే.

తానెంత విలువైన ఆటగాడినో చూపిస్తూ
అయినా సరే కొన్నిసార్లు అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ హెరాత్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే అంతర్జాతీయ క్రికెట్ నుంచి ముత్తయ్య మురళీధరన్ తప్పుకున్నాడో... ఆ తర్వాత రంగనా హెరాత్ తానెంత విలువైన ఆటగాడినో చూపిస్తూ చెలరేగిపోయాడు. ఆ తర్వాత ఆడిన 70 టెస్టుల్లో కేవలం 26 యావరేజితో ఏకంగా 359 వికెట్లు తీశాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో పదో స్థానంలో (430 వికెట్లు) కొనసాగుతున్నాడు.

తొలి పదేళ్లలో కేవలం 14 టెస్టులు మాత్రమే
తొలి పదేళ్లలో కేవలం 14 టెస్టులు మాత్రమే ఆడటంతో హెరాత్ కెరీర్ ముగిసిందని అంతా భావించారు. ఈ దశలో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేందుకు వెళ్లి తన బౌలింగ్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఆ తర్వాత 31 ఏళ్ల వయసులో 2009లో అనూహ్యంగా వచ్చిన మరో అవకాశాన్ని రెండు చేతుల ఒడిసిపట్టుకోవడంతో పాటు జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాతే అతను 230 వికెట్లు తీయడం విశేషం.

నాలుగో ఇన్నింగ్స్‌లో అతను అత్యధిక వికెట్లు
ఇతర బౌలర్లతో పోలిస్తే హెరాత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం నాలుగో ఇన్నింగ్స్‌లో అతను అత్యధిక వికెట్లు తీయడమే. చివరి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని పడగొట్టి మ్యాచ్‌ను గెలిపించడంలో తనకెవరూ సాటి రారన్నట్లుగా హెరాత్ ఏకంగా 12 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న మురళీధరన్ కేవలం ఏడు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించగలిగాడు. ఈ క్రమంలో రంగనా హెరాత్ శ్రీలంక జట్టుకు అనేక విజయాలను అందించాడు.

డర్బన్‌లో 9 వికెట్లు తీసిన హెరాత్
2011లో డర్బన్ వేదికగా ఆతిథ్య సఫారీ జట్టుతో జరిగిన టెస్టులో అద్భుత బౌలింగ్‌తో 9 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాపై శ్రీలంక తొలి టెస్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్ బౌలర్‌గా హెరాత్‌కు గుర్తింపు లేకపోయినప్పటికీ వివాద రహితుడు. తాను తొలి టెస్టు ఆడిన, బాగా అచ్చొచ్చిన గాలే మైదానంలో(99 వికెట్లు) తీశాడు. తన ఆఖరి టెస్టులో హెరాత్ మరో ఐదు వికెట్లు తీస్తే మరో అరుదైన ఘనతను సాధిస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications