మూడో ఆటగాడు: గాలే స్టేడియంలో చరిత్ర సృష్టించిన రంగనా హెరాత్

హైదరాబాద్: తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతోన్న శ్రీలంక స్పిన్ దిగ్గజం రంగనా హెరాత్ చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా మంగళవారం ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన టెస్టు రంగనా హెరాత్‌కు చివరి టెస్టు అన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో హెరాత్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఒకే వేదికపై 100 అంతకన్నా ఎక్కువ వికెట్లు
ఒకే వేదికపై 100 అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసిన టెస్టు బౌలర్లలో మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు గాలే స్టేడియంలో 99 వికెట్లు తీసిన రంగనా హెరాత్ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన హెరాత్... జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

100వ టెస్టు వికెట్ కావడం
దీంతో గాలే స్టేడియంలో హెరాత్‌కు ఇది 100వ టెస్టు వికెట్ కావడం విశేషం. అంతకు ముందు టెస్టుల్లో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌లు మాత్రమే అంతకు ముందు ఈ ఘనత సాధించారు.

మురళీధరన్ అయితే మూడు వేదికల్లో 100కుపైగా
ముత్తయ్య మురళీధరన్ అయితే మూడు వేదికల్లో ఈ ఘనత సాధించాడు. సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, అసిగిరియ స్టేడియం, గాలే అంతర్జాతీయ స్టేడియంలలో మురళీధరన్ 100కు పైగా వికెట్లను తీయగా, జేమ్స్ ఆండర్సన్ లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 100కు పైగా వికెట్లు తీశాడు.

జో రూట్ వికెట్ తీయడం ద్వారా హెరాత్ ఈ ఘనత
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన జో రూట్ వికెట్ తీయడం ద్వారా రంగనా హెరాత్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. కాగా, గాలే అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లాండ్, శ్రీలంకల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నేడు ప్రారంభం కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications