
హైదరాబాద్: పల్లెకెలె వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో జో రూట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టు మూడో రోజు ముగిసేసరికి 278 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రూట్ (124; 146 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో రాణించాడు.
జో రూట్‌తో పాటు బర్న్స్ (59), ఫోక్స్ (51 బ్యాటింగ్) రాణించడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. లంక స్పిన్నర్ల ధాటికి ఓ దశలో 109 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్ ఆదుకున్నాడు. రూట్‌తో పాటు రొరీ బర్న్స్ (59), బెన్ ఫోక్స్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ప్రస్తుతం ఫోక్స్‌తో పాటు అండర్సన్ క్రీజులో ఉన్నాడు. స్పిన్నర్ అకిల ధనంజయ ఆరు వికెట్లు తీయగా, దిల్‌రువాన్ పెరీరాకు రెండు వికెట్లు దక్కాయి. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.