ఓటమితో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రంగనా హెరాత్


హైదరాబాద్: శ్రీలంక స్పిన్ దిగ్గజం రంగనా హెరాత్ ఓటమితో వీడ్కోలు పలికాడు. గాలె వేదికగా శుక్రవారం ముగిసిన తొలి టెస్టులో శ్రీలంక జట్టు 211 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ వేదికపై ఇంగ్లాండ్ జట్టు టెస్టులో గెలుపొందడం ఇదే తొలిసారి. 1999లో గాలే వేదికగా జరిగిన టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన రంగనా హెరాత్ 19 ఏళ్ల పాటు ఆ జట్టుకు సేవలందించాడు.
అయితే, ఏ వేదికలోనైతే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడో అదే వేదికపై రంగనా హెరాత్ తన చివరి టెస్టు మ్యాచ్‌ని ఆడటం విశేషం. మంగళవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆతిథ్య శ్రీలంక జట్టు 203 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 139 పరుగుల ఆధిక్యం లభించింది.
322/6 వద్ద గురువారం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్
ఈ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 322/6 వద్ద గురువారం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం 462 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఛేదన 250 పరుగులకే ఆలౌట్ కావడంతో మరో రోజు మిగిలుండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది. గాలే టెస్టు తన కెరీర్‌లో చివరి టెస్టు అని రంగనా హెరాత్ అక్టోబర్ నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటైన హెరాత్
దీంతో ఆఖరి టెస్టులో రంగనా హెరాత్‌కు విజయంతో వీడ్కోలు పలకాలనే లంకేయులు ఆశ నెరవేరలేదు. ఈ మ్యాచ్‌లో రంగనా హెరాత్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో రంగనా హెరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. మొత్తంగా హెరాత్ టెస్టుల్లో 433 వికెట్లు తీశాడు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హెరాత్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
ఒకే వేదికపై 100 అంతకన్నా ఎక్కువ వికెట్లు
ఒకే వేదికపై 100 అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసిన టెస్టు బౌలర్లలో మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు గాలే స్టేడియంలో 99 వికెట్లు తీసిన రంగనా హెరాత్ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన హెరాత్... జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గాలే స్టేడియంలో హెరాత్‌కు ఇది 100వ టెస్టు వికెట్ కావడం విశేషం. అంతకు ముందు టెస్టుల్లో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

మురళీ ధరన్ తర్వాత హెరాతే
శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌లు మాత్రమే అంతకు ముందు ఈ ఘనత సాధించారు. ముత్తయ్య మురళీధరన్ అయితే మూడు వేదికల్లో ఈ ఘనత సాధించాడు. సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, అసిగిరియ స్టేడియం, గాలే అంతర్జాతీయ స్టేడియంలలో మురళీధరన్ 100కు పైగా వికెట్లను తీయగా, జేమ్స్ ఆండర్సన్ లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 100కు పైగా వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications