For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిర్‌పుర్ టెస్టులో బంగ్లాపై భారీ ఆధిక్యం దిశగా శ్రీలంక

By Nageshwara Rao
Sri Lanka Vs Bangladesh, 2nd Test: Silva's fifty puts visitors in control on Day 2

హైదరాబాద్: మిర్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో శ్రీలంక రెండోరోజుకే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఓవర్‌నైట్‌స్కోరు 56/4తో రెండో రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది.

Sri Lanka vs Bangladesh 2018 2nd Test Score Card

శ్రీలంక బౌలర్లు సురంగ లక్మల్ (3/25), అకిలా ధనుంజయ (3/20) దెబ్బకు బంగ్లాదేశ్ రెండోరోజు మరో 54 పరుగులు జోడించి కుప్పకూలింది. తొలి రోజు 14 వికెట్లు నేలకూలిన ఈ మ్యాచ్‌లో రెండో రోజూ మరో 14 వికెట్లు పడ్డాయి.

112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ప్రస్తుతం రోషన్‌ సిల్వ (58), లక్మల్‌ (7) క్రీజులో ఉన్నారు. మరో మూడు రోజుల ఆట మిగిలున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇప్పటికి 312 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.

Story first published: Saturday, February 10, 2018, 11:27 [IST]
Other articles published on Feb 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+