Sri Lanka vs Australia: క్రికెటర్లకు శీతల పానీయాలు.. వాటర్ బాయ్‌గా అవతారమెత్తిన ప్రధాని!!

కాన్‌బెర్రా: దేశ ప్రధానిగా అత్యుత్తమైన హోదా ఉన్నా.. క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో వాటర్ బాయ్ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ డ్రింక్స్ సమయంలో ఆటగాళ్లకు శీతల పానీయాలు అందించి 'మారిసన్' ఔరా అనిపించుకున్నారు.

వార్మప్ మ్యాచ్:
ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లసిత్ మలింగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆదివారం అడిలైడ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20 కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాన్‌బెర్రాలోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI, శ్రీలంక జట్లు గురువారం వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి.

శీతల పానీయాల పెట్టెతో మైదానంలోకి:
ఈ మ్యాచ్ 16వ ఓవర్‌లో లంక ఆటగాడు దసున్ శనక వికెట్‌ను ఆసీస్ పేసర్ డేనియల్ ఫాలిన్స్ తీయగానే.. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ శీతల పానీయాల పెట్టెతో మైదానంలోకి పరుగెత్తారు. ఆటగాళ్లందరికీ పానీయాలు అందించారు. అంతేకాదు వారితో కరచాలనాలు చేశారు. ఈ ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. అనంతరం అందరూ శీతల పానీయాలు తాగుతూ ప్రధానితో మాట్లాడారు.

ప్రధాని గారు మీకు హాట్సాఫ్:
స్కాట్ మారిసన్ తెలుపు రంగు షర్టు, నల్ల రంగు ప్యాంటు ధరించి ఆసీస్ జట్టు క్యాప్‌ను ధరించి మైదానంలో వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు తమదైన స్థాయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'ప్రధాని సూపర్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఆస్ట్రేలియా ప్రధానిది గొప్ప పని' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 'ఈ ప్రపంచంలో ఏ పనిని తక్కువగా చూడకూడదని నిరూపించారు', 'మీరు గ్రేట్ సార్', 'ప్రధాని గారు మీకు హాట్సాఫ్' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గాయంతో బాధపడుతున్న ఫించ్:
ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన శ్రీలంక యువ జట్టు.. పాక్ జట్టును వైట్‌వాష్ చేసి సత్తా చాటింది. అదే జోష్‌లో పూర్తిస్థాయి జట్టుతో ఆస్ట్రేలియాకు వెళ్ళింది. కంగారూలను కూడా ఓడించి సిరీస్ సొంతం చేసుకోవాలని లంక ఉవ్విళ్లూరుతోంది. అయితే అది అంత సులభం కాదు. గాయంతో బాధపడుతున్న ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలి 20 నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. 'శ్రీలంకతో మ్యాచ్‌కు పూర్తి సిద్ధంగా ఉన్నాం. పర్యాటక జట్టుపై విజయం సాధిస్తాం' అని కోచ్ జస్టిన్ లింగర్ ధీమా వ్యక్తం చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications