For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంకేయుల ఆధిపత్యం: పరువు కోసం ఆస్ట్రేలియా తుది పోరాటం: ఆసీస్ జట్టులో ఆ మార్పు

 Australia and Sri Lanka are set to lock horns in the fifth and final game of the five-match.

కొలంబో: ద్వీపదేశం శ్రీలంక క్రికెట్ జట్టు.. తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి ఇక ఎంతో సమయం పట్టేలా కనిపించట్లేదు. వరుస పరాజయాలకు ఆ జట్టు చెక్ పెట్టింది. మేటి జట్టు ఆస్ట్రేలియాపై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయిదు వన్డేల సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలవుండగానే సొంతం చేసుకుంది. 3-1 తేడాతో గెలుచుకుంది. ఇవ్వాళ చివరి వన్డే. ఇందులో కూడా ఘన విజయం సాధించడానికి లంకేయులు ఉవ్విళ్లూరుతున్నారు.

 చివరి వన్డే..

చివరి వన్డే..

ఈ రెండు జట్ల మధ్య ఇవ్వాళ చివరిదైన అయిదో వన్డే మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకున్న నేపథ్యంలో- ఆస్ట్రేలియా పరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో కూడా శ్రీలంక గెలిస్తే- అంతకంటే ఘోర పరాభవం ఆస్ట్రేలియన్లకు మరొకటి ఉండకపోవచ్చు. సిరీస్ విజయం ఇచ్చిన ఊపుతో కదం తొక్కుతునన శ్రీలంక జట్టును అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు పెద్ద టాస్క్.

 తొలి వన్డే ఓడినా..

తొలి వన్డే ఓడినా..

తొలి వన్డేలో ఓడిన లంక జట్టు అద్భుతంగా పుంజుకొంది. రెండు, మూడు వన్డేల్లో తిరుగులేని విజయాలను అందుకుంది. మూడో వన్డేలో 292 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు 48.3 ఓవర్లల్లోనే కొట్టి పడేశారు. ఓపెనర్ పాథుమ్ నిశ్శంక, వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో చెలరేగారు. నిశ్శంక..147 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి.

ఊపు మీదున్న లంక బ్యాటర్లు..

ఊపు మీదున్న లంక బ్యాటర్లు..

నాలుగో వన్డేలోనూ అదే దూకుడును ప్రదర్శించారు లంక బ్యాటర్లు. సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక 101 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. చరిత్ అసలంక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 106 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్లతో 110 పరుగులను చేశాడు. ఇది అతని తొలి సెంచరీ. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ దిగిన అసలంక.. బ్యాటింగ్ బ్యాక్‌బోన్‌గా నిలిచాడు. అటు ధనంజయ కూడా 61 బంతుల్లో ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు మూడో వన్డే సెంచరీ హీరో పాథుమ్ నిశ్శంక కూడా విజృంభించాడంటే ఆస్ట్రేలియన్లకు కష్టాలు తప్పకపోవచ్చు.

పరువు కోసం..

పరువు కోసం..

నిజానికి ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. తొలి వన్డే ఆసీస్‌దే. ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్‌లల్లో మట్టికరిచింది. అనూహ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలహీనపడింది. చివరిదైన అయిదో వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆసీస్ భావిస్తోంది. కాగా- మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ గాయం వల్ల వైదొలిగాడు. అతని స్థానంలో జోష్ ఇగ్లీస్ ఆడనున్నాడు.

 తుదిజట్టు అంచనాలు ఇలా..

తుదిజట్టు అంచనాలు ఇలా..

శ్రీలంక తుదిజట్టులో- నిరోషన్ డిక్‌వెల్లా (వికెట్ కీపర్), పాథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డాసన్ శనక (కేప్టెన్), చమిక కరుణరత్నె, జెఫ్రీ వాండెర్సె, దుష్మంత చమీర, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగె ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో- డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కేప్టెన్), మిఛెల్ మార్ష్, మార్నుస్ లాంబుషెన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జోష్ ఇగ్లీస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, జైరె రిచర్డ్‌సన్, పాట్ కమ్మిన్స్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ హేజిల్‌వుడ్ ఆడొచ్చు.

Story first published: Friday, June 24, 2022, 7:14 [IST]
Other articles published on Jun 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+