Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆఖరి వన్డే ఆడిన మలింగ.. ఘనంగా వీడ్కోలు పలికిన లంక

Sri Lanka Eye Winning Farewell For Lasith Malinga In 1st ODI V Bangladesh || Oneindia Telugu
Sri Lanka v Bangladesh: Lasith Malinga takes 3 wickets in final ODI, Sri Lanka beat Bangladesh by 91 runs

కొలంబో: యార్కర్లతో ప్రత్యర్థులను భయపెట్టే శ్రీలంక స్టార్ పేసర్‌ లసిత్‌ మలింగ శుక్రవారం తన తుది వన్డే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో లంక 91 పరుగుల తేడాతో విజయం సాధించి వెటరన్‌ పేసర్‌ మలింగకు ఘనంగా వీడ్కోలు పలికింది. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక మలింగ టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు యార్కర్ల కింగ్‌ ఆడనున్నాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

 చివరి మ్యాచ్‌లో మూడు వికెట్లు:

చివరి మ్యాచ్‌లో మూడు వికెట్లు:

కొలంబోలోని ప్రేమదాస మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మలింగ (9.4-2-38-3) అద్భుత ప్రదర్శన చేసాడు. మలింగ చివరి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసాడు. బంగ్లా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్‌.. ముస్తాఫిజుర్ రెహమాన్ వికెట్లను పడగొట్టాడు. వన్డే కెరీర్ చివరి బంతికి కూడా వికెట్ తీయడం విశేషం. మ్యాచ్ అనంతరం లంక ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు.

2004లో వన్డేల్లో అరంగేట్రం:

2004లో వన్డేల్లో అరంగేట్రం:

2004లో వన్డేల్లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున మురళీధరన్ (534), వాస్ (400) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు.

శ్రీలంక విజయం:

శ్రీలంక విజయం:

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక 91 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 314 పరుగుల భారీ స్కోర్ చేసింది. కుశాల్ పెరీరా (99 బంతుల్లో; 111) సెంచరీ చేసాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా 223 పరుగులకే 41.4 ఓవర్లలో ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (67), సబ్బీర్‌ రహమాన్‌ (60) అర్ధ సెంచరీలు చేశారు. నువాన్‌ ప్రదీప్, మలింగకు మూడు వికెట్లు దక్కాయి.

Story first published: Saturday, July 27, 2019, 11:58 [IST]
Other articles published on Jul 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+