For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌లో శ్రీలంక పర్యటన: షెడ్యూల్, జట్లు, టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, వేదిక వివరాలు

Sri Lanka tour of Pakistan 2019: Full Schedule, Squads, Telecast, Live Streaming, Venue and More

హైదరాబాద్: పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం కరాచీ వేదికగా ద్వైపాక్షిక సిరిస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు శ్రీలంక ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో తలపడనుంది. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్లు పేలవ ప్రదర్శన చేయడంతో ఈ సిరిస్‌కు రెండు జట్లలోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

సర్ఫరాజ్ అహ్మాద్ కెప్టెన్‌గా తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకోగా... వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న మికీ ఆర్ధర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పొడిగింపు ఇవ్వలేదు. అతడి స్థానంలో కొత్త హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం మిస్బా ఉల్ హక్‌ను నియమించింది. కోచ్‌గా మిస్బా ఉల్ హక్‌‌కు ఇదే తొలి ద్వైపాక్షిక సిరిస్ కావడం విశేషం.

సీనియర్ ఆటగాళ్లు డుమ్మా

సీనియర్ ఆటగాళ్లు డుమ్మా

మరోవైపు శ్రీలంక విషయానికి వస్తే భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్‌లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే సహా పలువురు సీనియర్‌ ఆటగాళ్లు పాక్ పర్యటనకు దూరంగా ఉన్నారు. సీనియర్‌ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో.. శ్రీలంక బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని అక్కడికి పంపించింది. పాక్ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

కరాచీ వేదికగా తొలి వన్డే

కరాచీ వేదికగా తొలి వన్డే

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కరాచీ వేదికగా సెప్టెంబర్ 27న శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తొలి వన్డేతో తలపడనుంది. జనవరి 2009 తర్వాత కరాచీ వేదికగా జరుగుతున్న మొట్టమొదటి వన్డే ఇదే కావడం విశేషం. మరోవైపు పాకిస్థాన్-శ్రీలంక జట్లు చివరగా అక్టోబర్, 2017లో జరిగిన వన్డేలో తలపడ్డాయి. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు తలపడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ సిరిస్‌లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

పాకిస్థాన్‌లో శ్రీలంక పర్యటన టూర్ షెడ్యూల్:

పాకిస్థాన్‌లో శ్రీలంక పర్యటన టూర్ షెడ్యూల్:

వన్డేలు

1st ODI at National Stadium, Karachi: September 27 at 15:30 IST

2nd ODI at National Stadium, Karachi: September 29 at 15:30 IST

3rd ODI at National Stadium, Karachi: October 03 at 15:30 IST

టీ20లు

1st T20I at Gaddafi Stadium, Lahore: October 05 at 19:00 IST

2nd T20I at Gaddafi Stadium, Lahore: October 07 at 19:00 IST

3rd T20I at Gaddafi Stadium, Lahore: October 09 at 19:00 IST

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

పాకిస్తాన్ వన్డే జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), బాబర్ ఆజం (వైస్ కెప్టెన్), అబిద్ అలీ, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హరిస్ సోహైల్, ఇఫ్తీఖర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ అమీర్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్ , మహ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, వహబ్ రియాజ్.

శ్రీలంక వన్డే జట్టు: లాహిరు తిరిమన్నే (కెప్టెన్), దనుష్క గుణతిలక, సదీరా సమరవిక్రమ, అవిష్కా ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, దాసున్ షానకా, మినోడ్ భానుకా, ఏంజెలో పెరెరా, వనిందు హసారానుసాన్ రాజ్ మరియు లాహిరు కుమార

శ్రీలంక టి20 జట్టు: దాసున్ షనకా (కెప్టెన్), దనుష్కా గుణతిలక, సదీరా సమరవిక్రమ, అవిష్కా ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, ఏంజెలో పెరెరా, భానుకా రాజపక్సే, మినోడ్ భానుకా, లాహిరు మదుషానక హసాన్ కసున్ రజిత, లాహిరు కుమార

పాకిస్థాన్ టీ20 జట్టుని ఇంకా ప్రకటించలేదు.

పాక్‌లో శ్రీలంక పర్యటన

పాక్‌లో శ్రీలంక పర్యటన

టెలికాస్ట్:

సోనీ స్పోర్ట్స్

లైవ్ స్ట్రీమింగ్:

జియో టీవీ, ఎయిర్‌టెల్ టీవీ

Story first published: Thursday, September 26, 2019, 18:32 [IST]
Other articles published on Sep 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+