హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ జట్టు నవంబరులో భారత్‌లో పర్యటించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ ముగియగానే న్యూజిలాండ్ జట్టు ఇక్కడికి రానుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ పూర్తికాగానే శ్రీలంక జట్టు భారత్‌లో అడుగుపెట్టనుంది. ఆరువారాల పాటు సాగే ఈ పర్యటనలో శ్రీలంక 3 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.
వేదికలు, తేదీలు దాదాపు ఖరారయ్యాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. నవంబర్ 16న మొదలయ్యే ఈ సిరీస్ డిసెంబర్ 24తో ముగుస్తుంది. ఇక, తొలి టెస్టు (కోల్‌కతా) నవంబర్ 16 నుంచి, రెండో టెస్టు (నాగ్‌పుర్) నవంబర్ 24 నుంచి, మూడో టెస్టు (ఢిల్లీ) డిసెంబర్ 2 నుంచి జరగనున్నాయి.

డిసెంబర్ 10న ధర్మశాలలో తొలి వన్డే, 13న మొహలీలో రెండో వన్డే, 17న విశాఖపట్నం వేదికగా జరగనుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీసీ-వీడీసీఏ మైదానం వేదికగా జరగనున్న ఏడో వన్డే కానుంది. ఈ మైదానంలో భారత్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.
మూడు వన్డేలు ముగిసిన తర్వాత డిసెంబర్ 20న కటక్‌లో తొలి టీ20, 22న ఇండోర్‌లో రెండో టీ20, 24న ముంబైలో మూడో టీ20 నిర్వహించనున్నారు.
భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటన పూర్తి షెడ్యూల్:
టెస్టులు
1st Test: November 16-20 (Kolkata)
2nd Test: November 24-28, (Nagpur)
3rd Test: December 2-6, (Delhi)
వన్డేలు
1st ODI: December 10 (Dharamsala) - Sunday
2nd ODI: December 13 (Mohali) - Wednesday
3rd ODI: December 17 (Visakhapatnam) - Sunday
టీ20లు
1st T20I: December 20 (Cuttack) - Wednesday
2nd T20I: December 22 (Indore) - Friday
3rd T20I: December 24 (Mumbai) - Sunday