For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీలతో చెలరేగిన సంగక్కర, దిల్షాన్: స్కాట్లాండ్‌పై లంక భారీ విజయం

హోబర్ట్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా హోబర్ట్ మైదానంలో బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 148 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దిల్షాన్ (104), సంగక్కర (124) శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో తడపబడిన స్కాట్లాండ్ 43.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. కొలెమన్ 70, మొమ్సెన్ 60 పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాట్స్‌మెన్లు పరుగులు తీయడంలో విఫమయ్యారు. దీంతో 148 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్ పరాజయం పాలైంది.

 Sri Lanka thump Scotland by 148 runs

శ్రీలంక బౌలర్లలో కులశేఖర, చమీర మూడేసి వికెట్లు పడగొట్టారు. మలింగ 2, పెరీరా, దిల్షాన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్లు నష్టపోయి 363 పరుగులు చేసింది. దిల్షాన్, సంగక్కర సెంచరీలతో చెలరేగి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించారు.

కాగా, ఈ విజయంతో శ్రీలంక జట్టు గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరుకుంది. సంగక్కర 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. సంగక్కర ఈ మ్యాచులో సెంచరీ చేయడం ద్వారా వరుసగా నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంక ఆడిన గత మూడు మ్యాచుల్లో కూడా సంగక్కర సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+