Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆలోచనలన్నీ దక్షిణాఫ్రికా పర్యటనపైనే, లంకతో సిరిస్ కలిసొస్తుంది'

హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరిస్‌కు సన్నద్ధమయ్యేందుకు శ్రీలంక సిరీస్‌ మంచి అవకాశమని టీమిండియా టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా అన్నాడు. ఈ సిరిస్‌లో పరుగులు సాధిస్తానని పుజారా ధీమా వ్యక్తం చేశాడు. నవంబరు 16 నుంచి శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుంది.

ఈ నేపథ్యంలో పుజారా గురువారం మీడియాతో మాట్లాడాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన‌కి టీమిండియా వెళ్తున్న నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్‌ జట్టుకి కలిసొస్తుందని పుజారా ధీమా వ్యక్తం చేశాడు. 'నా ఆలోచనలన్నీ వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉన్నాయి. దానికి సన్నద్ధమయ్యేందుకు శ్రీలంక సిరీస్‌ మంచి అవకాశం' అని పుజారా అన్నాడు.

Sri Lanka Test series a good preparation for next year's South Africa tour: Pujara

ఈ సిరిస్‌లో రాణిస్తానన్న నమ్మకం ఉంది. శ్రీలంకతో త్వరలో జరగబోవు టెస్టు సిరీస్‌.. ఆ పర్యటన సన్నద్ధతకి బాగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి.. లంక‌తో తొలి టెస్టు మొదలవగానే.. సఫారీ పర్యటన గురించి జట్టు సభ్యుల్లో చర్చ మొదలవుతుంది. దానికి తగినట్లుగానే జట్టు వ్యూహలను రచిస్తాం' అని పుజారా అన్నాడు.

దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌ల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారా? అన్న ప్రశ్నకు పుజారా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'ప్రతి సిరీస్‌కు చేసినట్టే దక్షిణాఫ్రికా సిరీస్‌కూ నా హోమ్‌వర్క్‌ చేస్తాను. నెట్స్‌లో నా బ్యాటింగ్ బలహీనతలను సరిదిద్దుకుంటుంటాను. అవి ఏంటని నేను ఇప్పుడు చెప్పలేను. కానీ.. లంకపై మెరుగైన ప్రదర్శన చేస్తాననే ధీమా ఉంది' అని పుజారా తెలిపాడు.

'గత శ్రీలంక సిరీస్‌లో ప్రత్యర్థుల బౌలింగ్‌ అంత బాగా లేదు. అయితే టెస్టుల్లో పరుగులు చేయడం సులభమేమీ కాదు. ప్రతి వ్యక్తికీ సొంత శైలి ఉంటుంది. ఇతరుల శైలి అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు' అని పుజారా పేర్కొన్నాడు. ఇటీవల జార్ఖండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో పుజారా 12వ ఫస్ట్‌ క్లాస్‌ డబుల్ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+