భారత్‌పై నాలుగు బౌలర్ల వ్యూహం: క్లీన్‌స్వీప్‌పై చండీమాల్
హైదరాబాద్: భారత్‌తో టెస్టు సిరిస్‌కు నాలుగు బౌలర్ల వ్యూహంతో మైదానంలోకి దిగే అవకాశం ఉందని శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ అన్నాడు. ఇటీవల యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అక్కడి ఉష్ణ వాతావరణంలో పాకిస్థాన్‌పై విజయవంతమైన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని భారత్‌లో అమలు చేయమని చెప్పుకొచ్చాడు.
'పాకిస్థాన్‌పై మేం ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో ఆడాం. ఉత్కపోత వాతావరణంలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అక్కడ నలుగురు బౌలర్లతో ఆడి గెలవడం సులభం కాదు. కానీ టీమిండియాలో అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అందుకే మేం ఆల్‌రౌండర్ గురించి ఆలోచిస్తున్నాం' అని చండిమాల్ అన్నారు.

నవంబర్ 16న కోల్‌కతాలో తొలి టెస్టు
మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 16 (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దినేశ్ చండీమాల్ గురువారం మీడియాతో మాట్లాడాడు.

ఇప్పుడెలా ఆడాలన్నదానిపైనే దృష్టి
భారత్‌లో కోహ్లీసేనతో ఆడడం తమకు పెద్ద సవాలేనన్న చండీమాల్... గతంలో ఇక్కడ తమ ఆటతీరు గురించి ఆలోచించకుండా ఇప్పుడెలా ఆడాలన్నదానిపై దృష్టి సారించామని అన్నాడు. 'శ్రీలంక 1982 నుంచి భారత్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. సొంతగడ్డపై ఈ ఏడాది జరిగిన సిరీసుల్లో కోహ్లీసేన చేతిలో క్లీన్‌స్వీప్ అయింది' అని చండిమాల్ అన్నాడు.

ప్రస్తుత సిరీస్‌ను కుర్రాళ్లు సవాల్‌గా తీసుకున్నారు
'టెస్టుల్లో 5-0, వన్డేల్లో 3-0, టీ20లో 1-0తో వైట్‌వాష్ అయింది. అందుకే ప్రస్తుత సిరీస్‌ను కుర్రాళ్లు సవాల్‌గా తీసుకున్నారు' అని చండిమాల్ తెలిపాడు. ఇటీవల పాకిస్థాన్‌పై మెరుగైన ప్రదర్శన చేశామని, జట్టులో యువ కుర్రాళ్లు ఈ సిరిస్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నారు' అని చండిమాల్ పేర్కొన్నాడు.

టీమిండియా నెంబర్‌వన్ జట్టు
‘ప్రస్తుతం టీమిండియా నెంబర్‌వన్ జట్టని తెలుసు. గత రెండేళ్లుగా వారు నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నారు. కుర్రాళ్లు ఈ సవాల్‌ను ఎదుర్కొంటారని ఆశిస్తున్నా. ఏంజెలో మాథ్యూస్, రంగనా హెరాత్‌ను మినహాయిస్తే నాతో సహా అందరికీ ఇదే భారత్‌లో తొలి పర్యటన' అని చండీమాల్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications