
హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వచ్చే మంగళవారం ముంబైలో ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాహ విందుకి శ్రీలంక క్రికెటర్లు దూరంకానున్నారు. కేవలం సెలబ్రిటీలకే ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన విందుకు ఆ జట్టు క్రీడాకారులు హాజరుకాలేకపోతున్నందుకు పలు కారణాలు చెప్పుకొస్తున్నారు.
డిసెంబరు 21వ తేదీ ఢిల్లీలోని హోటల్ తాజ్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన కోహ్లీ మళ్లీ రెండో సారి ముంబైలో ఇవ్వనున్నాడు. అయితే ముందు దానికి బంధువులు, సన్నిహితులే వస్తారని అంచనా వేశాడు. రెండో దానికి సినీ తారలు, క్రికెట్ స్టార్లు రానున్నారు.
భారత్‌తో ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతున్న శ్రీలంక జట్టు చివరి టీ20 మ్యాచ్‌ని ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ఆడనుంది. సుదీర్ఘ సిరీస్‌లో ఇదే ఆఖరి మ్యాచ్.
సోమవారం ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని.. మంగళవారం విందుకి హాజరవుతారనే ఉద్దేశంతో కోహ్లి ప్లాన్ చేశాడు. కానీ, శ్రీలంక క్రికెటర్లు సోమవారమే భారత్‌ని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జనవరి 15 నుంచి ఢాకా వేదికగా శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లు ముక్కోణపు సిరీస్‌ని ఆడనున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా ప్రస్తుతం భారత్‌కి వచ్చిన 24 మంది శ్రీలంక క్రికెటర్లలో 16 మంది నేరుగా బంగ్లాదేశ్‌కి ఇక్కడ నుంచే వెళ్లనున్నారట.
మిగిలిన ఆటగాళ్లు టెస్టు సిరీస్ సన్నద్ధత కోసం స్వదేశానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ముగిసిన టెస్టు, వన్డే సిరీస్‌తో పాటు తాజాగా టీ20 సిరీస్‌ని కూడా 0-2తో చేజార్చుకున్న లంకేయులు తీవ్ర నిరాశలో ఉండటంతో రిసెప్షన్‌కి వెళ్లేందుకు ఆసక్తి కనబర్చడంలేదని అని పలువురు విమర్శిస్తున్నారు. మరి అది నిజమో..కాదో..?
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.