
బ్యాటింగ్ కోచ్‌కి పాజిటివ్:
ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొన్న లంక ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం శ్రీలంకకు చేరుకున్నారు. కొలంబోలో అడుగుపెట్టిన శ్రీలంక టీమ్‌కి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కి పాజిటివ్‌గా తేలింది. దాంతో అతడ్ని వెంటనే ఐసోలేషన్‌కి పంపిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లను కూడా క్వారంటైన్‌కి తరలించింది. ఇంగ్లండ్ నుంచి గ్రాంట్ ఫ్లవర్ వచ్చిన విమానంలోనే శ్రీలంక క్రికెటర్లు రావడంతో.. ఇప్పుడు టీమ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి అయితే క్రికెటర్లలో ఎవరికీ పాజిటివ్‌గా రాలేదని లంక బోర్డు తెలిపింది.

ఇంగ్లీష్ జట్టులో కరోనా కేసులు
ఇంగ్లండ్, శ్రీలంక మధ్య సిరీస్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే ఇంగ్లీష్ జట్టులో ఏకంగా ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ముగ్గురు ప్లేయర్స్ ఉండగా.. నలుగురు సహాయ సిబ్బంది ఉన్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొలంబోకి వచ్చే ముందే శ్రీలంక టీమ్‌కి కరోనా పరీక్షలు చేయించారు. అప్పుడు ఎవరికీ పాజిటివ్ రాలేదు. దాంతో ప్లేయర్స్ అందరూ కలిసే ఉన్నారు. తాజా బ్యాటింగ్ కోచ్‌కి వైరస్ సోకడం.. అదీ ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన 48 గంటల్లోనే తేలడం శ్రీలంక టీమ్‌లో కంగారు పెంచుతోంది.

నాలుగు రోజులే మిగిలి ఉండడంతో:
గత నెల చివర్లోనే శ్రీలంకకి చేరుకున్న శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు జులై 13 నుంచి 25 వరకూ వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడనుంది. సిరీస్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండడంతో.. ఒకవేళ శ్రీలంక టీమ్‌లో కరోనా కేసులు నమోదైతే పరిస్థితి ఏంటని దేశ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. భారత్, శ్రీలంక మధ్య సిరీస్ ద్వారా రూ.89 కోట్ల ఆదాయం శ్రీలంక బోర్డుకి వచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సిరీస్‌లు రద్దవడంతో.. గత ఏడాదన్నరగా శ్రీలంక బోర్డు తీవ్ర నష్టాల్లో ఉంది.

జూలై 13న తొలి వన్డే:
ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్ ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. కొలొంబోలోని ప్రేమదాస మైదానంలో మ్యాచులు అన్ని జరగనున్నాయి.


Click it and Unblock the Notifications












