Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంక వన్డే టీమ్‌ను ఇండియా ఫ్లైట్ ఎక్క‌నివ్వ‌లేదు

Sri Lanka Sports Minister Stops Team Leaving for India ODIs

హైద‌రాబాద్‌: ఈ ఏడాది శ్రీ‌లంక ఆడిన మ్యాచ్‌లు 21 అయితే అందులో గెలిచింది నాలుగే. ప్ర‌స్తుతం లంకేయుల‌పైన గ‌ట్టి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న త‌రుణంలో మ‌రింత శ్ర‌ద్ధ చూపెట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసే దిశ‌గా అక్క‌డి క్రీడా మంత్రి ద‌య‌సిరి జ‌య‌శేఖ‌ర.

సోమవారం అర్ధరాత్రి 9 మంది ప్లేయర్స్ ఇండియా ఫ్లెట్ ఎక్కాల్సి ఉండగా.. వాళ్లందరినీ వెనక్కి రావాల్సిందిగా ఆయన పిలిపించారు. 1973 చట్టం ప్రకారం జాతీయ జట్లలో మార్పులు చేసే అధికారం శ్రీలంక క్రీడా మంత్రికి ఉంటుంది. ఆ అధికారంతోనే ఇండియాకి వ‌స్తున్న 9 మంది ఆట‌గాళ్ల‌ను వెన‌క్కి పిలిపించారు.

వ‌న్డే కోసం ఎంపిక చేసిన టీంకు తాను ఓకే చెప్పకుండానే వాళ్లంతా వెళ్లడానికి సిద్ధమవడంపై జయశేఖర మండిపడ్డారు. కెప్టెన్‌తో స‌హా అంద‌రినీ ఆపేసి క‌నీసం రెండు మార్పులు చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఇండియాకు వస్తున్న ఈ 9 మంది సభ్యులలో వన్డే కెప్టెన్ థిసర పెరీరా కూడా ఉన్నాడు. అతనితోపాటు ఉపుల్ తరంగ, గుణతిలక, గుణరత్నె, డిసిల్వా, సచిత్ పతిరన, చమీర, ప్రదీప్ ఉన్నారు. మిగతా సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 5, 2017, 17:39 [IST]
Other articles published on Dec 5, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+