Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాపై శ్రీలంక బోణీ

Kumar Sangakkara
సెంచూరియన్: అజంతా మెండిస్ స్పిన్ మాయాజాలంతో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచులో మంగళవారం శ్రీలంక చేతిలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మట్టి కరిచింది. మెండిస్ 30 పరుగులిచ్చి మూడు దక్షిణాఫ్రికా వికెట్లను తీసుకున్నాడు. వర్షం అడ్డు రావడంతో శ్రీలంక డక్ వర్త్స్ లూయిస్ పద్ధతిలో 55 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. వరుస బంతుల్లో మెండిస్ గ్రేమ్ స్మిత్, జాక్విస్ కలిస్, జెపి డుమినీ వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు. దక్షిణాఫ్రికా వర్షం పడడానికి ముందు 37.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 319 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్ మన్ తిలకరత్నే దిల్షాన్ చెలరేగి ఆడి 92 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అతనికి వన్డేల్లో ఇది మూడో సెంచరీ. అతని సెంచరీలో 16 బౌండరీలు, ఒక సిక్స్ ఉన్నాయి. శ్రీలంక స్కోర్ 16 పరుగుల వద్ద ఉండగా పది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రీలంక ఓపెనర్ జయసూర్య స్టెయిన్ బౌలింగ్ లో పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత సంగక్కరతో కలిసి దిల్షాన్ 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 47 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. పార్నెల్ మూడు వికెట్లు తీసుకున్నప్పటికీ 79 పరుగులు ధారపోశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+