సీనియర్లు దూరం: ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక పర్యటన ఖరారు

హైదరాబాద్: యాషెస్ సిరిస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కివీస్ పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.
2018 తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఉపఖండంలో పర్యటిస్తోన్న తొలి సిరిస్ ఇదే కావడం విశేషం. మార్చి 7న శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ప్రారంభమయ్యే మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొలంబోలోనే పి సారా ఓవల్ వేదికగా మార్చి 12 నుంచి 15 వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనుంది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్
అనంతరం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టు మార్చి 19న గాలే వేదికగా జరగనుంది. 2015 తర్వాత ఈ స్టేడియంలో జరిగిన టెస్టుల్లో శ్రీలంక కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే ఓడిపోయింది. ఈ వేదికలో శ్రీలంక చివరగా ఓడిన టెస్టు మ్యాచ్ 2018లో ఇంగ్లాండ్ చేతిలోనే కావడం విశేషం.

ప్రేమదాస స్టేడియంలో రెండో టెస్టు
ఆ తర్వాత రెండో టెస్టుకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక మూడు టీ20ల సిరిస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళుతోంది. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడటానికి ముందు శ్రీలంక జట్టు టీమిండియాతో మూడు టీ20ల సిరిస్, జింబాబ్వేతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

ప్రస్తుతం కివీస్ పర్యటనకు
అలాగే ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు, వెస్టిండిస్‌తో మూడు వన్డేలు, రెండు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇక, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఐదు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. నవంబర్ 1తో జరిగే తొలి టీ20తో న్యూజిలాండ్‌లో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమవుతుంది.

ఇంగ్లాండ్ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్
టీ20 సిరిస్‌కు ఇంగ్లాండ్ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ వ్వవహారించనున్నాడు. అయితే, ఈ సిరిస్‌కు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఈ ఏడాది సమ్మర్‌లో ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘంగా క్రికెట్ ఆడిన క్రికెటర్లను విశ్రాంతినిచ్చింది. దీంతో న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు పలువురు సీనియర్ క్రికెటర్ల సేవలను కొల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications