
హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 16 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు కొల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ సిరిస్‌లో టీమిండియా గనుక మెరుగ్గా రాణిస్తే భారత క్రీడాకారుల ర్యాంకులు మెరుగయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా బౌలర్లు, ఆల్‌రౌండర్ల జాబితాలో గతంలో నెంబర్‌వన్‌గా నిలిచిన రవీంద్ర జడేజా తిరిగి అగ్రస్ధానంలో నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో రవీంద్ర జడేజా బౌలర్, ఆల్‌రౌండర్ల విభాగంలో రెండో స్థానంలో కొనసాగుతోన్నాడు.
బౌలర్ల విభాగంలో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కంటే 12 పాయింట్లు వెనుక ఉన్న జడేజా, ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ ఆల్ హాసన్ కంటే కేవలం 8 పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు. ఈ రెండు విభాగాల్లో జడేజా అగ్రస్థానానికి చేరుకోవాలంటే పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా ఈ రెండు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోవడంతో సెప్టెంబర్లో జడేజా అగ్రస్థానాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. భారత్ తరుపున 32 టెస్టులాడిన జడేజా 155 వికెట్లతో పాటు 1136 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టెస్టు టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 806 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐదో స్ధానంలో ఉన్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీల మధ్య తేడా ఒకే ఒక్క పాయింట్ మాత్రమే. ఈ ఒక్క పాయింట్‌ను అధిగమిస్తే కోహ్లీ టాప్-5లో చోటు దక్కించుకోవచ్చు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్‌లో , గూగుల్ ప్లస్ ఫాలో అవ్వండి.