భువీని పక్కనపెట్టడం బాధించింది, రహానే గణాంకాలను చూడండి
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో భారత్‌కు ఒరిగిందేమీ లేదని అదో చెత్త సిరీస్ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే కోహ్లీసేన 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు.

లంకేయులు ఈజీగా ఓటమిని అంగీకరించారు
'సఫారీలతో సిరీస్‌కు ముందు స్వదేశంలో లంకతో సిరీస్ వల్ల కోహ్లీ సేన నేర్చుకున్నదేం లేదు. లంకేయులు ఈజీగా ఓటమిని అంగీకరించారు. దాంతో భారత క్రికెట్ జట్టుకు ఒరిగిందేమీ లేదు. బీసీసీఐ సూచించినట్లుగా కొందరు టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు కొన్ని రోజుల ముందే దక్షిణాఫ్రికాకు వెళ్లి ప్రాక్టీస్ చేసి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవి' అని భజ్జీ చెప్పాడు.

ధర్మశాలలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది
'అలా కుదరని పక్షంలో సఫారీ పర్యటనకు సన్నాహకంగా ధర్మశాలలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉండేది. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినా బాగుండేది. చల్లగా ఉండే ఆ మైదానం ఎంతో ఎత్తులోనూ ఉంటుంది. దక్షిణాఫ్రికా పిచ్‌ల తరహాలోనే స్వింగ్, సీమ్, బౌన్స్‌కు అనుకూలిస్తుంది' అని హర్భజన్ సింగ్ అన్నాడు.

రహానేను ఎంపిక చేయకపోవడంపై
మరోవైపు సఫారీ పర్యటనలో తొలి రెండు టెస్టులకు తుది జట్టులో రహానేను ఎంపిక చేయకపోవడంపై కోహ్లీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా రహానే స్పందించాడు. 'రహానేకు చోటు దక్కకపోవడంపై విమర్శిస్తున్నారు. కానీ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పుడు ఎవరి చోటుపై గ్యారంటీ ఉండదని ఆటగాళ్లు, విమర్శకులు గ్రహించాలి' అని భజ్జీ అన్నాడు.

రహానే యావరేజి 40 కన్నా తక్కువగా ఉంది
'నేను కొన్ని గణాంకాలు పరిశీలించాను. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 30 టెస్టుల్లో రహానే యావరేజి 40 కన్నా తక్కువగా ఉంది. దాంతో పాటు గతేడాది అతడు చాలినన్ని పరుగులు చేయలేదు. అందరూ అనుకుంటున్నట్టు రహానేను తీసుకున్నా భారత్ 0-2తో ఓటమిపాలైతే ఏం చేసేవారు. అతడి స్థానంలో రోహిత్‌ను తీసుకోమని చెప్పేవారు' అని చెప్పుకొచ్చాడు.

భువీని పక్కనపెట్టడం మాత్రం బాధించింది
'ఇక, భువనేశ్వర్ కుమార్‌ను పక్కనపెట్టడం మాత్రం నన్ను బాధించింది. భువీ విషయంలో మాత్రం 50-50శాతం అవకాశాలు ఉండేవి. ఇషాంత్‌తో పోలిస్తే ఈ కాలంలో భువీ పెద్ద మ్యాచ్ విన్నర్. భువీ రాణించిన ప్రతిసారీ జట్టు గెలుపొందింది. ఇషాంత్ కంటే భువీనే నా దృష్టిలో బెస్ట్ చాయిస్. ఈ సిరిస్‌లో చివరి టెస్టులో కోహ్లీసేన పుంజుకుని సిరీస్‌ను 1-2తో ముగిస్తుందని అనుకుంటున్నా' అని భజ్జీ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications