
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో భాగంగా గీలాంగ్ లో నెదర్లాండ్, శ్రీలంక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 162 పరుగులు చేసింది. కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కుసల్ మెండిస్ 44 బంతుల్లో 5 సిక్స్ లు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అసలంక 31 పరుగులు చేయగా రజపక్సే 19, నిస్సానక 14 పరుగులు చేయడం శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
కుసల్ మెండిస్
కుసల్ మెండిస్ ఒక్కడే నెదర్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. మిగతా వారు కాస్త తడబడ్డారు. నెదర్లాండ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్, బాస్ డి లీడే రెండేసి వికెట్లు తీయగా.. ఫ్రెడ్ క్లాసెన్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ శ్రీలంక భారీ విజయం సాధిస్తేనే సూపర్-12 అకాశం ఉంటుంది. గ్రూప్ ఎ లో శ్రీలంక, నెదర్లాండ్, నమీబియా, యూఏఈ ఉండగా.. యూఏఈ వరల్డ్ కప్ నుంచి ఇప్పటికే ఔటయింది.
రన్ రేట్
నెదర్లాండ్ రెండు విజయలతో 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక, నమీబియా ఒక్కో విజయంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూఏఈ నమీబియా గెలిస్తే.. శ్రీలంక నెదర్లాండ్ పై భారీ తేడాతో గెలుపొందాలి అల అయితేనే శ్రీలంకకు సూపర్-12కు ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే నమీబియా గ్రూప్ ఎలో ఎక్కువ రన్ రేట్ ఉంది. యూఏఈ భారీ తేడాతో నమీబియా విజయం సాధిస్తే సూపర్ -12కు వెళ్తుంది. అప్పుడు నెదర్లాండ్, శ్రీలంకలో రన్ రేటు ఎక్కువ జట్టు సూపర్ -12కు వెళ్తుంది.