
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా సిడ్నీ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు. నిస్సాంక 45 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. భానుక రాజపక్స 22 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు.
మార్క్ వుడ్
వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ 14 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 18 పరుగులు చేశాడు. ధనుంజయ డిసిల్వా 9, చరిత్ అసలంక 8, కెప్టెన్ దాసున్ షనక 3, హసరంగ 9 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో
మార్క్ వుడ్ మూడు వికెట్ల పడగొట్టాడు. అదిల్ రషీద్, బెన్ స్టోక్స్, వోక్స్, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు.
సెమీస్
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది. ఒక వేళ శ్రీలంక గెలిస్తే గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా సెమీస్ కు వెళ్తుంది. అంటే ఆస్ట్రేలియా సెమీస్ భవితవ్యం శ్రీలంక చేతిలో ఉంది. అయితే గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ వెళ్లింది. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పోటీ పడుతున్నాయి. గ్రూప్-1 నుంచి పాయింట్ల పరంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా 7 పాయింట్లతో ఉన్నాయి. కానీ రన్ రేటు లో న్యూజిలాండ్ మెదటి స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ రెండు స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.