
పాకిస్థాన్‌లో పర్యటించడం అనుమానంగానే
అయితే, తాజాగా శ్రీలంక జట్లు పాకిస్థాన్‌లో పర్యటించడం అనుమానంగానే మారింది. పాక్‌లో శ్రీలంక పర్యటన సందర్భంగా తమ ఆటగాళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే ప్రమాదం ఉందంటూ తమకు హెచ్చరికలు వచ్చాయని శ్రీలంక బోర్డు పేర్కొంది. 2009లో శ్రీలంక జట్టు పాక్ పర్యటనలో ఉన్నప్పుడు లాహోర్‌లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.

శ్రీలంకకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు
ఈ ఉగ్రదాడిలో శ్రీలంకకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ హోం మ్యాచ్‌లను ఆ దేశ క్రికెట్ బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహిస్తోంది. అయితే, ఇన్నాళ్లకు మళ్లీ అదే శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించేందుకు ముందుకొచ్చింది.

3 వన్డేలు, 3 టీ20లు
ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. కరాచీ వేదికగా సెప్టెంబర్ 27,29న రెండు వన్డేలు... అక్టోబర్ 3న లాహోర్ వేదికగా మూడో టీ20 జరగనుంది. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగలతో పాటు సీనియర్ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించారు.

యువ ఆటగాళ్లకు చోటు
ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరిస్ కోసం ప్రకటించిన జట్లలో శ్రీలంక క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లకు చోటు కల్పించింది. శ్రీలంక జట్టు పాక్ పర్యటన నేపథ్యంలో ఉగ్రదాడి జరగొచ్చనే అనుమానాన్ని శ్రీలంక ప్రధానమంతి కార్యాలయం తమకు తెలియజేసిందని శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది. దీంతో పాక్‌లో భద్రత పరిస్థితులను మరోసారి సమీక్షించాలని చెప్పింది.


Click it and Unblock the Notifications












